Telangana Liberation Day: సెప్టెంబర్ 17 తెలంగాణ రాజకీయాలను షేక్ చేస్తోంది. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారంగా నిర్వహించాలని కేంద్ర సర్కార్ నిర్ణయించడం రాజకీయ కాక రాజేసింది. సెప్టెంబర్ 17న పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న కార్యక్రమానికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. ఈ పరిణామంతో ఆ రోజున ఏం జరగబోతుందన్న చర్చ సాగుతోంది. సెప్టెంబర్ 17కు సంబంధించి అధికార టీఆర్ఎస్, బీజేపీ మధ్య డైలాగ్ వార్ ముదురుతోంది. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్.
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్రం అధికారికంగా నిర్వహిస్తుండటం కేసీఆర్ కు నిద్ర లేకుండా చేస్తుందన్నారు బండి సంజయ్. అందుకే విలీన వజ్రోత్సవాల పేరుతో కేసీఆర్ మరో జిమ్మిక్కు చేయబోతున్నారని చెప్పారు. ఇంతకాలం తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా జరపకుండా అమర వీరులను సీఎం కేసీఆర్ అవమానించారని సంజయ్ మండిపడ్డారు. ఉద్యమ సమయంలో అధికారికంగా నిర్వహించాలంటూ ఉద్యమాలు చేసిన కేసీఆర్.. గత ఎనిమిది ఏళ్లుగా ఎందుకు నిర్వహించలేకపోయారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.తన మిత్రపక్షం ఎంఐఎం పార్టీకి భయపడి కేసీఆర్ విమోచన వేడుకలను జరపకపోవడం సిగ్గుచేటన్నారు బండి సంజయ్. సీఎం కేసీఆర్ అసలైన తెలంగాణవాది అయితే సెప్టెంబర్ 17న తెలంగాణ విలీనానికి బదులు విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని సంజయ్ డిమాండ్ చేశారు.
మరోవైపు తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించేందుకు కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ సన్నాహాలు చేస్తోంది. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అధికారులతో సమీక్ష చేశారు. వేడుకలకు హాజరుకావాలని తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ముఖ్యమంత్రులకు కిెసన్ రెడ్డి లేఖ రాశారు. సెప్టెంబర్ 17న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది కేంద్రం. కేంద్ర బలగాల గౌరవ వందనం స్వీకరించనున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. నిజాం ఆస్తులకు సంబంధించిన ప్రాంతాల్లో కేంద్ర సర్కార్ ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనుంది.
Also Read : Kcr Target Jr Ntr: బీజేపీకి జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేయనున్నారా? కేసీఆర్ కు అందుకే టార్గెట్ అయ్యారా?
Also Read: Sujatha: షేక్ పేట మాజీ తహశీల్దార్ సుజాత సూసైడ్.. అవినీతి కేసులో గతంలో అరెస్ట్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి