Bandi Sanjay Arrested in Kamareddy Protest: కామారెడ్డి మునిసిపాలిటీ మాస్టర్ ప్లాన్ కి వ్యతిరేకంగా నెల రోజుల నుంచి రైతులు జరుపుతున్న ధర్నాకు సంఘీభావంగా బీజేపి రాష్ట్ర అధ్యక్షుడు, కరీంనగర్ ఎంపి బండి సంజయ్ తలపెట్టిన ధర్నా ఉద్రిక్తలకు దారితీసింది. బండి సంజయ్, బీజేపి నేతలు కామారెడ్డి కలేక్టరేట్‌లోకి వెళ్లకుండా పోలీసులు గేట్లను మూసేయడంతో బీజేపి కార్యకర్తలు, పోలీసులకు మధ్య తీవ్ర స్థాయిలో తోపులాట జరిగింది. కలెక్టరేట్ కార్యాలయంలోకి తమని అనుమతించాలని డిమాండ్ చేస్తూ రైతులు, బీజేపీ కార్యకర్తల నినాదాలు చేశారు. ప్రభుత్వ తీరుకు, పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ సందర్భంగా ధర్నాలో పాల్గొన్న రైతులు, బీజేపి కార్యకర్తలు పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తోసుకుని ముందుకెళ్లారు. కలెక్టరేట్ గేట్లు ఎక్కి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. అయితే వారి ప్రయత్నాలను తిప్పికొడుతూ భారీ సంఖ్యలో మొహరించిన పోలీసులు తమ శాయశక్తులా ఆందోళనకారులను అడ్డుకునే ప్రయత్నం చేశారు.
#WATCH | Telangana BJP president Bandi Sanjay and farmers protest outside the Collectorate office in Kamareddy against the municipal master plan and the TRS government. pic.twitter.com/SwY758cgC1
— ANI (@ANI) January 6, 2023
ఈ క్రమంలోనే ఈ ధర్నకు నేతృత్వం వహించిన బండి సంజయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బండి సంజయ్ ని అరెస్ట్ చేసే క్రమంలోనూ పోలీసులతో బీజేపి నేతలు, కార్యకర్తలు, రైతులు తీవ్ర వాగ్వీవాదానికి దిగి పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు బీజేపి కార్యకర్తలపై లాఠీ ఛార్జ్ చేస్తూ వారిని చెదరగొట్టారు. చివరకు కార్యకర్తల పెనుగులాట మధ్యే పోలీసులు బండి సంజయ్‌ను అరెస్ట్ చేసి జీపులోకి ఎక్కించారు. ఈ నేపథ్యంలో పోలీసుల లాఠీచార్జిలో పలువురు బీజేపి కార్యకర్తలకు గాయాలయ్యాయి. కామారెడ్డి రైతులకు న్యాయం జరిగేవరకు బీజేపి తమ పోరాటం ఆపే ప్రసక్తే లేదని బండి సంజయ్ తేల్చిచెప్పారు. అరెస్టులతో తమను అడ్డుకోలేరని.. రైతులకు తమ పార్టీ అండగా నిలబడుతుందని వారికి పార్టీ తరుపున భరోసా కల్పించే ప్రయత్నం చేశారు.
Telangana | Legal action will be taken against the ones who were involved in illegal actions that happened here. We will take action but it will take time. He (Bandi Sanjay) was arrested we will probably be sending him out of district: B Srinivas Reddy, SP Kamareddy pic.twitter.com/NCgWbDAI3C
— ANI (@ANI) January 6, 2023
స్పందించిన జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి
బండి సంజయ్ అరెస్ట్ పై కామారెడ్డి జిల్లా ఎస్పీ బి శ్రీనివాస్ రెడ్డి స్పందిస్తూ.. ఇక్కడ పరిస్థితులు చేయిదాటిపోకుండా ఉండేందుకు బండి సంజయ్‌ని ఇక్కడి నుంచి తరలించి జిల్లా సరిహద్దులు దాటిస్తున్నామని అన్నారు. కామారెడ్డిలో శాంతి భద్రతలు దెబ్బతినేలా కలెక్టరేట్ లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించి అసాంఘిక శక్తులపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని.. దానికి కొంచెం సమయం పడుతుంది అని ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి స్పష్టంచేశారు.
ఇది కూడా చదవండి : Revanth Reddy's Open Letter: కేసీఆర్‌కి రేవంత్ రెడ్డి ఓపెన్ లెటర్.. విషయం ఏంటంటే..
ఇది కూడా చదవండి : MLC Kavitha: ఎమ్మెల్సీ కవిత కేసు కంచి చేరిందా..! బీజేపీ-బీఆర్ఎస్ మధ్య డీల్..?
ఇది కూడా చదవండి : Kishan Reddy Comments: తెలంగాణ వాళ్ల కోసం కాదు, వేరే వాళ్ల కోసం దర్యాప్తు చేస్తుంటే వీళ్ల పేర్లు బయటకొచ్చాయి!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook