Boycott Valentines Day: బజరంగ్ దళ్ పేరు వింటేనే ప్రేమికులు భయపడతారు. వాళ్లు ప్రేమకు వ్యతిరేకమని ప్రేమికులు భావిస్తుంటారు. కానీ బజరంగ్ దళ్ సంస్థ ప్రేమకు వ్యతిరేకం కాదు. ప్రేమ పేరుతో చేసే వికృత చేష్టలను వ్యతిరేకిస్తోంది. పాశ్చాత్య సంస్కృతిని నిరసిస్తోంది.. పాశ్చాత్య పోకడలను తప్పుబడుతుంది. ఆ క్రమంలోనే ఫిబ్రవరి 14వ తేదీన వాలంటైన్స్ డే రోజు అంటూ యువతీయువకులు పార్కులు, థియేటర్లు, మాల్స్, ఇతర ప్రదేశాల్లో చేసే వికృత చేష్టలను తప్పుబడుతుంది. అందుకే ఆరోజున అబ్బాయి అమ్మాయి ఎవరూ జంటగా కనిపించినా వారికి పెళ్లి చేస్తారు. ఈసారి కూడా అలాగే చేస్తామని బజరంగ్ దళ్ హెచ్చరించింది. వాలంటైన్స్ డేను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా "ఫిబ్రవరి 14 అనేది ప్రేమికుల రోజు కాదని.. అమరవీరుల సంస్కరణ దినం" అని ప్రకటించింది.
Also Read: Transgender: అవమానాలనే మెట్లుగా చేసుకుని ఎదిగిన ట్రాన్స్‌జెండర్.. ఈ కథ స్ఫూర్తిదాయకం
హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో ప్రేమికుల దినోత్సవంపై రూపొందించిన పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి పండరీనాథ్, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శివ రాములు, వీహెచ్‌పీ ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి మాట్లాడారు. 'ప్రోత్సహించే వాలెంటైన్స్ డేను అడ్డుకొని తీరుతాం. విదేశీ విష సంస్కృతిని విడనాడి భారతీయ విలువలు, సంస్కృతి సంప్రదాయాలు పరిరక్షిద్దాం' అని పిలుపునిచ్చారు. ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డేను బహిష్కరించాలని సూచించారు. రేమ పేరుతో అశ్లీలతను పెంపొందించి, విదేశీ సంస్కృతిని బలవంతంగా రుద్దుతున్న కార్పోరేట్ శక్తుల కుట్రలకు బలికావద్దని యువతకు విజ్ఞప్తి చేశారు.
Also Read: Bir Billing Dog Loyal: కన్నీటి గాథ.. యజమాని బాడీ వద్ద 48 గంటలు కాపలా కాసిన పెంపుడు కుక్క
తాము ప్రేమకు వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. ప్రేమ పేరుతో చేస్తున్న విచ్చలవిడితనం, కల్తీ ప్రేమను తాము వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ప్రేమికుల రోజును అడ్డుకుంటామని హెచ్చరించారు. ఆ రోజు పార్కులు, హోటళ్లు, విహార స్థలాలు తదితర ప్రదేశాల్లో తిరిగే కల్తీ ప్రేమికులకు బుద్ధి చెబుతామని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరూ జాతీయ భావాలు అలవర్చుకోవాలని సూచించారు. భారతీయ జీవన విధానాన్ని ప్రతి ఒక్కరూ అవలంబించాలని చెప్పారు. కార్పొరేట్ దుష్టశక్తులు తమ వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించేందుకు దేశ సంస్కృతిపై దండయాత్ర చేస్తున్నాయని తెలిపారు.
అమరుల దినంగా స్మరణ
ఫిబ్రవరి 14వ తేదీన అమరవీరుల సంస్మరణ దినంగా పాటిద్దామని పండరీనాథ్, శివ రాములు, పగుడాకుల బాలస్వామి పిలుపునిచ్చారు. 2019లో అదే రోజు పుల్వామాలో దాడి జరిగి ఎందరో సైనికులు వీరమరణం పొందారని గుర్తుచేశారు. ఆరోజు వీరమరణం పొందిన జవాన్ల ఆత్మకు శాంతి కలిగేలా ర్యాలీలు నిర్వహిస్తామని ప్రకటించారు. ఫిబ్రవరి 14 అనేది ప్రేమికుల రోజు కాదని.. అమరవీరుల సంస్మరణ దినంగా పేర్కొన్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook