Srinivas Goud: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై హత్యాయత్నం కేసులో నిందితులకు పోలీస్ కస్డడీ

Srinivas Goud: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై హత్యాయత్నం కేసులో పోలీసులు విచారణ కొనసాగుతోంది. ఏడుగురు నిందితులకు నాలుగు రోజుల పాటు పోలీస్ కస్టడీకు న్యాయస్థానం అంగీకరించింది.  

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 8, 2022, 10:38 AM IST
  Srinivas Goud: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై హత్యాయత్నం కేసులో నిందితులకు పోలీస్ కస్డడీ

Murder attempt on Minister Srinivas Goud: తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై హత్యాయత్నం కేసులో పోలీసులు విచారణ కొనసాగుతోంది. ఏడుగురు నిందితులకు నాలుగు రోజుల పాటు పోలీస్ కస్టడీకు న్యాయస్థానం అంగీకరించింది. తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్‌పై హత్యాయత్నం కేసు సంచలనంగా మారింది. ఈ కేసులో ఇప్పటికే పోలీసులు 7మందిని అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు రాఘవేంద్రరాజు ఇచ్చిన స్టేట్‌మెంట్‌లో విస్తుగొలిపే అంశాలున్నాయి. 2017 నుంచి తనను మంత్రి టార్గెట్ చేస్తూ..వేధిస్తున్నారని..తనపై 30 కేసులు పెట్టి బెదిరించారని ఆరోపించాడు. ప్రధాన నిందితుడు రాఘవేంద్ర రాజు చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి. మరోవైపు ఈకేసులో పోలీసులు అరెస్టు చేసిన నిందితుల్ని నాలుగు రోజుల పాటు పోలీసుల కస్టడీకు మేడ్చల్ కోర్టు అంగీకరించింది. మరి కాస్సేపట్లో పేట్ బషీరాబాద్ పోలీసులు నిందితుల్ని కస్డడీలో తీసుకుని విచారణ ప్రారంభించనున్నారు.

హత్య కుట్ర వెనుక ఎవరున్నారు, ఎలా ప్లాన్ చేశారనే విషయాలపై లోతైన దర్యాప్తు చేయనున్నారు. ఇప్పటికే ఈ అంశమై మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి పీఏ జితేంద్రరాజుకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. జితేందర్ రెడ్డి డ్రైవర్‌కు న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. మంత్రి శ్రీనివాస్ గౌడ్ హత్యకు 15 కోట్ల సుపారీ గ్యాంగ్ ఉందనేది పోలీసులు చెబుతున్న మాట. నిందితులు ఉత్తరప్రదేశ్ నుంచి ఆయుధాలు సమకూర్చుకున్నారని కూడా పోలీసుల విచారణలో తేలింది. 

Also read: ఢిల్లీలో ఒక న్యాయం.. రాష్ట్రంలో మరో న్యాయమా.. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌పై హరీష్ రావు రియాక్షన్...

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News