Barrelakka: ఎన్నికల ప్రచారంలో బర్రెలక్కపై దాడి.. బోరున విలపిస్తూ కన్నీళ్లు

Attack On Barrelakka: ఎన్నికల ప్రచారంలో ఉన్న కొల్లాపూర్ స్వతంత్ర అభ్యర్థి బర్రెలక్కపై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి దిగారు. ఆమె సోదరుడిని కొట్టారు. పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో ఈ ఘటన చేసుకోగా.. దాడి అనంతరం బర్రెలక్క బోరున విలపిస్తూ.. కన్నీటి పర్యాంతమైంది.  

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 25, 2023, 04:39 PM IST
Barrelakka: ఎన్నికల ప్రచారంలో బర్రెలక్కపై దాడి.. బోరున విలపిస్తూ కన్నీళ్లు

Attack On Barrelakka: తెలంగాణ ఎన్నికల్లో బర్రెలక్క అలియాస్ శిరీష ఇప్పుడు సంచలనంగా మారింది. కొల్లాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి స్వతంత్ర అభ్యర్థి పోటీ బర్రెలక్క పోటీ చేస్తుండగా.. ఆమెకు నిరుద్యోగులు, భారీగా యువత మద్దతుగా నిలుస్తున్నారు. అందరూ ఇస్తున్న ప్రోత్సాహంతో బర్రెలక్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతోంది. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామం తిరుగుతూ.. తనకు ఓటు గెలిపించాలని ఓటర్లను కోరుతోంది. సోషల్ మీడియా వేదికగా చాలామంది బర్రెలక్క మద్దతు ఇవ్వాలని కోరుతున్నారు. ఆమె విజయం దేశం రాజకీయాల్లో సంచలనంగా మారుతుందని అభిప్రాయ పడుతున్నారు. దీంతో రాష్ట్రం మొత్తం కొల్లాపూర్ నియోజకవర్గంపై ప్రత్యేకంగా ఆసక్తి చూపుతోంది. నామినేషన్ విత్ డ్రా చేసుకోవాలని బర్రెలక్కకు ఇప్పటికే అనేక బెదిరింపు కాల్స్ రాగా.. అవేమి లెక్క చేయకుండా ప్రచారం రంగంలో తనదైన శైలిలో ఆకట్టుకుంటోంది. ఒంటరిగా ప్రయాణం మొదలుపెట్టి.. ఇప్పుడు వేలాది మద్దతుతో గెలుపుపై ధీమాతో ఉంది. 

ఈ నేపథ్యంలో కొల్లాపూర్ అసెంబ్లీ పరిధిలోని పెద్దకొత్తపల్లి మండలం వెన్నచర్ల గ్రామంలో మంగళవారం బర్రెలక్క ప్రచారం చేస్తుండగా.. గుర్తుతెలియని వ్యక్తులు దాడికి దిగారు. ఆమె తమ్ముడిని కొట్టగా.. ప్రచారంలో పాల్గొన్నవాళ్లను బెదిరించి అక్కడి నుంచి పంపించేశారు. ఈ దాడిలో బర్రెలక్కకు ఎలాంటి హానీ జరగలేదు. ఆమెపై దాడికి నిరసగా నిరుద్యోగ యువత ఆందోళన చేపట్టారు. ప్రజాస్వామ్యం స్వంతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తే.. దాడులు చేసి బెదిరిస్తారా..? అని ప్రశ్నిస్తున్నారు. పోలీసులు ఆమెకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.

ఈ దాడి ఘటన గురించి చెబుతూ.. బరెలక్క కన్నీటి పర్యాంతమైంది. తాను ఏం చేశానని దాడి చేశారని.. తన తమ్ముడిని కొట్టారంటూ ఆవేదన వ్యక్తం చేసింది. ఓట్లు చీల్లుతాననే భయంతోనే తనపై రాజకీయ నేతలు దాడికి పంపించారని ఆరోపించింది. రాజకీయాలంటేనే రౌడీయిజం అనే గతంలో చెప్పేవారని.. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నానని వాపోయింది. తనకు ఎన్నో బెదిరింపు కాల్స్ వచ్చినా.. వాళ్లను ఇప్పటివరకు బయటకు పెట్టలేదని చెప్పింది. పోలీసులు తనకు సపోర్ట్‌ చేస్తున్న వారికి రక్షణ కల్పించాలని వేడుకుంది. దాడి ఘటన గురించి సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే అక్కడికి చేరుకున్నారు. 

Also Read: Samsung Mobile Loot Offer: సాంసంగ్‌ వెబ్‌సైట్‌లో పిచ్చెక్కించే డీల్స్‌..Galaxy F54, M34 మొబైల్స్‌పై భారీ తగ్గింపు!  

Also Read: Oneplus 12 Launch: పిచ్చెక్కిపోయే ఫీచర్స్‌తో మార్కెట్లోకి Oneplus 12 స్మార్ట్ ఫోన్..ధర, ఫీచర్ల వివరాలు ఇవే..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News