మంత్రి హరీశ్ రావు గురించి అశ్వత్థామ రెడ్డి వ్యాఖ్యలు

మంత్రి హరీశ్ రావు గురించి అశ్వత్థామ రెడ్డి వ్యాఖ్యలు

Last Updated : Oct 19, 2019, 12:25 AM IST
మంత్రి హరీశ్ రావు గురించి అశ్వత్థామ రెడ్డి వ్యాఖ్యలు

హైదరాబాద్: మంత్రి హరీశ్‌ రావు మౌనంగా ఉండటం ఎవ్వరికీ మంచిది కాదని.. ఆయన వెంటనే ప్రజాక్షేత్రంలోకి రావాలని ఆర్టీసీ జేఏసీ చైర్మన్ అశ్వత్థామ రెడ్డి డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆర్టీసీ సమ్మె ఉధృతంగా నడుస్తున్నప్పటికీ.. హరీశ్ రావు పెదవి విప్పకపోవడం ఆశ్చర్యంగా ఉందని విస్మయం వ్యక్తంచేశారు. తాను అక్రమాస్తులు కూడబెట్టినట్టుగా వస్తోన్న ఆరోపణల్లో నిజం లేదన్న అశ్వత్థామ రెడ్డి.. అవసరమైతే తన ఆస్తులపై న్యాయ విచారణకైనా సిద్ధమేనని స్పష్టంచేశారు. తనకు అక్రమాస్తులు ఉన్నట్లుగా తేలితే బహిరంగ ఉరిశిక్షకైనా తాను సిద్ధమేనని తనపై ఆరోపణలు చేసేవారికి ఆయన సవాల్ విసిరారు. 

ఆర్టీసీని ప్రైవేటీకరిస్తామంటున్న సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలు.. నోటితో నవ్వి నొసటితో వెక్కిరించినట్లు ఉన్నాయని అశ్వత్థామ రెడ్డి విమర్శించారు. తాము చెప్పిన విషయాల్లో తప్పులుంటే ముక్కు నేలకు రాసి.. క్షమాపణలు చెప్పి రేపే విధుల్లో చేరుతామన్నారు. ఒకే వ్యక్తికి 44 పెట్రోల్ బంకులు ఇవ్వడంపై గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారని అశ్వత్థామ రెడ్డి గుర్తుచేశారు.

Trending News