అసెంబ్లీ ఎన్నికల్లో కుటుంబ పాలన అంటూ విమర్శలకు ఎదుర్కొన్న కేసీఆర్.. మహాకూటమి వ్యూహాత్మక తప్పిదాల వల్ల ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల్లో గట్టేక్కారు. ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో ముంచుకొస్తున్నాయి.ఈ నేపథ్యంలో కుటుంబ పాలన అనే ముద్ర తొలగించేందుకు కేసీఆర్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి.
లోక్ సభ ఎన్నికల్లో లబ్ది కోసమే...
కేసీఆర్ తన వ్యూహంలో భాగంగా తాత్కాలికంగా తనయుడు కేటీఆర్, అల్లుడు హరీశ్ లను తొలి విడత కేబినెట్ నుంచి దూరంగా ఉంచుతారని టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతానికి 8 నుంచి 10 మంది సభ్యులతో బుల్లి కెబినెట్ ఏర్పాటు చేసి ప్రభుత్వ ప్రయాణం చేస్తారని తెలిసింది.. లోక్ సభ ఎన్నికల తర్వాత కేబినెట్ విస్తరణ చేసి అందులో కేటీఆర్, హరీశ్ లను తీసుకుంటారనే ప్రచారం నడుస్తోంది
భిన్నాభిప్రాయాలు ....
దీనిపై రాజకీయవర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి.ఈ వ్యహం అమలు చేస్తే కేసీఆర్ కుటుంబ పాలన విమర్శల నుంచి బయటిపడతారని.. తద్వార లోక్ సభ ఎన్నికల్లో లబ్ది జరుగుతుందని ఒక వర్గం నేతలు అంటున్నారు. రాజకీయ విమర్శలను తలొగ్గి కేటీఆర్, హరీశ్ లను పక్కడే పెడితే జనాల్లో చెడు సంకేతాలు వెళ్తాయని మరోవర్గం నేతలు చెబుతున్నారు..రాజకీయాల్లో రాటుదేలుతున్న క్రమంలో ఇద్దరిని పక్కడ పెడితే జనాల్లో కేటీఆర్,హరీశ్ లకు ఉన్న గుర్తింపు కోల్పోయే అవకాశముందని...దీనికి తోడు కేబినెట్ బలహీనపడుతుందనే వాదిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కేటీఆర్, హరీశ్ లను కేబినెట్ లో తీసుకోవాల్సిందేనని పార్టీ శ్రేణులు కోరుతున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది.