Pawan Kalyan: ఏపీకి అనారోగ్యం.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, ఆయన కుటుంబానికి వైరల్‌ జ్వరం

Pawan Kalyan And His Family Suffers From Viral Fever: వరద సహాయ చర్యల్లో నిమగ్నమైన ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అస్వస్థతకు లోనయ్యారు. ఆయనతోపాటు ఆయన కుటుంబం కూడా వైరల్‌ ఫీవర్‌లతో బాధపడుతోంది.

Written by - Ravi Kumar Sargam | Last Updated : Sep 6, 2024, 12:29 AM IST
Pawan Kalyan: ఏపీకి అనారోగ్యం.. డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, ఆయన కుటుంబానికి వైరల్‌ జ్వరం

Pawan Kalyan And His Family: భారీ వర్షాలు.. వరదలతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్‌లో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి. అయితే రెండు రోజులు ఆలస్యంగా రంగంలోకి దిగిన జనసేన పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ అలా సమీక్షలు చేశారో లేదో ఇలా అనారోగ్యానికి గురయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించకముందే ఆయన అస్వస్థతకు గురయ్యారు. డిప్యూటీ సీఎం జ్వరం బారినపడ్డారని జనసేన పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఆయనే కాదు ఆయన కుటుంబసభ్యులు అంతా జ్వరాలతో బాధపడుతున్నారని సమచారం.

Also Read: YS Jagan: చంద్రబాబుకు ముఖ్యమంత్రి పీఠంపై కూర్చునే అర్హత లేదు: మాజీ సీఎం జగన్

 

హైదరాబాద్‌ నుంచి విజయవాడ చేరుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వరద సహాయ చర్యలపై మునిగారు. రెండు రోజులు అధికారులతో సమీక్షలు చేశారు. వర్షాలతో గ్రామాల్లో అధ్వానంగా మారిన పరిస్థితులపై అధికార యంత్రాంగానికి ఆదేశాలు జారీ చేశారు. ఇక డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌పై కూడా సమీక్ష చేశారు. రాష్ట్రంలో వర్షాలు, వరదలపై అధికారులకు ఆదేశాలు ఇస్తూ బిజీగా ఉన్నారు. అయితే అనూహ్యంగా ఆయన అనారోగ్యానికి గురయ్యారు.

Also Read: YS Sharmila: శెభాష్‌ సీఎం చంద్రబాబు.. వరద సహాయ చర్యలపై వైఎస్‌ షర్మిల ప్రశంసలు

 

ఏపీ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం నుంచి కొంత అస్వస్థతకు లోనయ్యారని సమాచారం. బుధవారం కొంత అవస్థ పడగా.. గురువారం మరింత తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. వైరల్ జ్వరం, తీవ్రమైన దగ్గుతో బాధపడుతున్నారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. అస్వస్థతకు గురయినప్పటికీ గురువారం ఉదయం తన నివాసంలో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనరేట్ అధికారులతో సమావేశమయ్యారు. 

కుటుంబం కూడా
ఆంధ్రప్రదేశ్‌లో వరద పరిస్థితిపై సమీక్షించారు. వరద నీరు తగ్గుముఖం పట్టిన ప్రాంతాల్లో పారిశుద్ధ్య పనులు వేగవంతం చేయాలని, సూపర్ క్లోరినేషన్ చేపట్టాలని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ ఆదేశించారు. అంటు వ్యాధులు ప్రబలే ప్రమాదం, దోమల బెడద తీవ్రత ఉండడంతో పారిశుద్ధ్య నిర్వహణ పకడ్బందీగా చేపట్టాలని సూచించారు. స్వచ్ఛమైన తాగునీరు సరఫరా చేయాలని.. దానికి అనుగుణంగా తగిన ఏర్పాట్లు చేసి నిరంతర పర్యవేక్షణ చేయాలని చెప్పారు. అనంతరం ఏలేరు రిజర్వాయర్ కి వరద ముప్పుపై ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు. అయితే అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన కొద్దిసేపు విశ్రాంతి పొందుతున్నారు. వైద్యుల సూచనలు పాటిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. అయితే ఉప ముఖ్యమంత్రి కుటుంబసభ్యులు కూడా వైరల్ జ్వరాలతో బాధపడుతున్నారని తెలిసింది.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News