Asaduddin Owaisi: మాధవీ లత ఎఫెక్ట్..?.. పండితుల ఆశీర్వాదం తీసుకున్న అసదుద్దీన్ ఓవైసీ..వీడియో వైరల్..

Lok Sabha Election 2024: లోక్ సభ ఎన్నికల వేళ హైదరాబాద్ లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. మజ్లీస్ నేత ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ వేద పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. మలక్‌పేట పరిధిలోని మూసారాంబాగ్ లో అసదుద్దీన్ ఓవైసీ ప్రచారం నిర్వహిస్తుండగా కొందరు పండితులు ఆయనకు తమ మద్దతు తెలిపారు.  

Written by - Inamdar Paresh | Last Updated : May 4, 2024, 10:28 AM IST
  • ఎన్నికల ప్రచారంలో అరుదైన ఘటన..
  • పండితులతో బ్లెస్సింగ్స్ తీసుకున్న అసదుద్దీన్..
Asaduddin Owaisi: మాధవీ లత ఎఫెక్ట్..?.. పండితుల ఆశీర్వాదం తీసుకున్న అసదుద్దీన్ ఓవైసీ..వీడియో వైరల్..

Asaduddin Owaisi election Campaign: ఎన్నికలు సమీపిస్తున్న కొలది నేతలు ప్రచారం స్పీడ్ ను పెంచారు. ఎలాగైన ఈ ఎన్నికలలో గెలవాలని నానా తంటాలు పడుతున్నారు. ఓటరు మహాశయులను ఆకర్శించుకునేందుకు అందివచ్చిన ఏ అవకాశంను కూడా జారవిడుచుకోవడంలేదు. ఈ క్రమంలో కొందరునేతలు.. ప్రచారంలో ఇంటింటికి వెళ్లి తమకు మద్దతు తెలపాలని అభ్యర్థిస్తుంటారు. అంతేకాకుండా..హోటల్స్ లలో వెళ్లి టీలు చేయడం దోశలు వేయడం వంటివి చేస్తుంటారు. జనాలు ఎక్కడైతే ఎక్కువగా ఉంటారో..అక్కడ ఎన్నికల అభ్యర్థులు వెళ్లడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ముఖ్యంగా జనాలను ఆకట్టుకోవడానికి ఏ కార్యక్రమం, ఎలాంటి వేడుకనైన క్యాష్ చేసుకోవడానికి కొందరు నేతల తెగ తాపత్రయపడుతుంటారు.

 

ఈ క్రమంలో ప్రస్తుతం మజ్లీస్ నేత ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ చేసిన పని ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఓవైసీ బ్రదర్స్ లు ఎక్కువగా ముస్లింలకు మద్దతుగా ఉంటారు. అనేకమార్లు హిందువుల పట్ల,హిందు మత విద్వేశాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేస్తుంటారు. పలుమార్లు బహింరంగ సమావేశంలో.. హిందు దేవతలపై, హిందు ఆచారాలు, పద్ధతులపై చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదస్పందంగా మారిన విషయం తెలిసిందే. ఈక్రమంలో ఆయన మలక్ పేట ఎన్నికల ప్రచారంలో పండితులు ఆశీర్వాదం తీసుకోవడం తెలంగాణలో హాట్ టాపిక్‌ గా మారింది.

పూర్తి వివరాలు..

తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో అనుకోని ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ ప్రస్తుతం రాజకీయాల్లో హాట్ టాపిక్ మారింది. ఇక్కడ బీజేపీ నుంచి బరిలో నిలిచిన మాధవీలత తనదైన స్టైల్ లో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఆమె కట్టర్ హిందులా కన్పిస్తున్న ఓల్డ్ సిటీలో ముస్లింలతో మమేకమవుతూ ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఓవైసీ బ్రదర్స్ కంచుకోటలా భావించే ఓల్గ్ సిటిలో తన ప్రచారంలో అందరిని మాధవీతల కలుపుకుని పోతున్నారు. పదేళ్ల కాలంలో ఓవైసీ బ్రదర్స్ పాతబస్తీకి చేసిందేమీలేదని ఆమె ఎద్దేవా చేశారు. కేవలం వారు అధికారంలో ఉండి తమ స్వార్థం మాత్రమే చూసుకున్నారన్నారు. తాను ఎంపీగా గెలిస్తే.. ఓవైసీ చేయని డెవలప్ మెంట్ ను కేవలం అనతీకాలంలో చేసి చూపెడతానంటూ కూడా ఓటర్లకు భరోసా ఇస్తున్నారు.

కొంపెల్ల మాధవీలతకు ఓల్డ్ సిటీలో అన్ని వర్గాల నుంచి అనూహ్యాంగా స్పందన కూడా వస్తుంది. ఈ క్రమంలో ఆమె ఇటు ఓటర్లకు తన ప్రసంగాలు, కట్టు బోట్టు, వేశ ధారణ, కట్టర్  హిందులా కన్పించిన కూడా.. ముస్లింలను కూడా కలుపుకుని వెళ్తున్నారు. ఇదే క్రమంలో ఓవైసీ బ్రదర్స్ ఎప్పులు లేని విధంగా తమను జైలులో పెడుతారని, చంపేందుకు కుట్రలు చేస్తున్నారంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. రామాలయం, హనుమాన్ జయంతి శోభాయాత్రలలో.. ఆమె చేసిన వ్యాఖ్యలు, బహిరంగ ప్రసంగాలు, మసీదుపైన బాణం ఎక్కుపెట్టడం వంటివి రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. బీజేపీ అగ్రనేతలు సైతం.. మాధవీలతకు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో ఆమెకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు.

Read More: UP Teen Collapses: టెన్షన్ పుట్టిస్తున్న ఘటనలు.. హాల్దీ వేడుకలో డ్యాన్స్ చేస్తూ చనిపోయిన యువతి..వైరల్ గా మారిన వీడియో..

ఈక్రమంలో అసదుద్దీన్ కూడా తన పంథాను మార్చుకున్నారో.. లేదా మాధవీలతను కాపీ కొడుతున్నారో.. గానీ మలక్ పేట ఎన్నికల ప్రచారంలో ఆసక్తికర ఘటన  జరిగింది. అసదుద్దీన్ మలక్ పేటలోని  మూసారాంబాగ్, ఇందిరా నగర్ ప్రాంతాల్లో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఆ సమయంలో.. పురోహితులు ఆయనకు పూలమాలలు వేశారు. అంతే కాకుండా.. ఆయనకు మద్దతు తెలపటం ఆసక్తికరంగా మారింది. అసదుద్ధీన్ ఓవైసీ చుట్టూ దాదాపు ముస్లింలే ఉండగా.. శుక్రవారం నిర్వహించిన ప్రచారంలో కొంత మంది పురోహితులు అసదుద్దీన్‌ను కలిసి.. ఆయనకు పూలమాల వేసి మరీ తమ సపోర్ట్ తెలిపారు. దీనికి సంబంధించిన ఫొటోను అసదుద్దీన్ స్వయంగా తన ట్విట్టర్ ఖాతాలో పంచుకున్నారు. ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో తెల  వైరల్‌గా మారింది.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News