Komatireddy Venkat Reddy: ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర తెలంగాణలో అడుగు పెట్టిన రోజే తెలంగాణ కాంగ్రెస్ లో సంచలన పరిణామం జరిగింది. కొంత కాలంగా తన కామెంట్లతో పార్టీలో కాక రేపుతున్న సీనియర్ నేతపై యాక్షన్ కు సిద్ధమైంది కాంగ్రెస్ హైకమాండ్. తెలంగాణ స్టార్ క్యాంపెయినర్, భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై నోటీసులు జారీ చేసింది. పది రోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. ఆయన ఇచ్చే వివరణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనుంది కాంగ్రెస్ అధిష్టానం. సొంత పార్టీ అభ్యర్థిగా బదులుగా విపక్షం నుంచి అభ్యర్థికి మద్దతు ఇవ్వడం పార్టీ లైన్ దాటడమేనని ఆ నోటీసులో తెలిపింది కాంగ్రెస్ అధిష్టానం. క్రమశిక్షణ తప్పినట్లు డిసిప్లినరీ యాక్షన్ కమిటీ ప్రాథమిక నిర్ధారణకు వచ్చిందని.. తదుపరి ఎందుకు చర్యలు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని పేర్కొంది.
మూడు రోజుల క్రితం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆడియో లీకై వైరల్ గా మారింది. మునుగోడుకు చెందిన జబ్బార్ అనే కాంగ్రెస్ నేతకు ఫోన్ చేసిన వెంకట్ రెడ్డి.. మునుగోడు ఎన్నికలో తన సోదురుడు రాజగోపాల్ రెడ్డికి మద్దతు ఇవ్వాలని కోరారు. పార్టీలకు అతీతంగా రాజగోపాల్ రెడ్డి సపోర్ట్ చేయాలన్న వెంకట్ రెడ్డి.. తానే పీసీసీ చీఫ్ కాబోతున్నానని చెప్పారు. మునుగోడు దెబ్బకు పీసీసీ చీఫ్ ను మారుస్తారని.. ఆ తర్వాత అంతా మనదేనంటూ కాంగ్రెస్ నేతకు భరోసా ఇచ్చారు. కోమటిరెడ్డి మాట్లాడిన ఈ ఆడియో కలకలం రేపింది. అది మరవకముందే కోమటిరెడ్డికి చెందిన మరో వీడియో బయటికి వచ్చి కాంగ్రెస్ పార్టీలో కల్లోలం రేపింది.
మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి దూరంగా ఉంటూ కుటుంబ సభ్యులతో కలిసి ఆస్ట్రేలియా వెళ్లారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. జర్నీలో భాగంగా ఎయిర్ పోర్టులో తనను రిసీవ్ చేసుకునేందుకు వచ్చిన అభిమానులతో మాట్లాడారు. అందులో
మునుగోడులో కాంగ్రెస్ గెలవదని చెప్పారు. తాను ప్రచారం చేసినా పది ఓట్లు పెరుగుతాయ్ తప్ప.. పార్టీ గెలిచే పరిస్థితి లేదన్నారు వెంకట్ రెడ్డి. మునుగోడులో తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గెలవడం ఖాయమన్నారు. తాను 25 ఏళ్లుగా ప్రజాప్రతినిధిగా ఉన్నానని.. ఇకపై తాను రాజకీయాలకు దూరంగా ఉంటానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. కీలకమైన మునుగోడు ఉప ఎన్నిక వేళ పార్టీ గెలవదంటూ వెంకట్ రెడ్డి చేసిన కామెంట్లపై హైకమాండ్ కు కొందరు నేతలు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన హైకమాండ్ వెంకట్ రెడ్డికి షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 10 రోజుల్లో వివరణ ఇవ్వాలని ఆదేశించింది.హైకమాండ్ నోటీసుపై వెంకట్ రెడ్డి ఎలా స్పందిస్తారన్నది ఆసక్తిగా మారింది.
ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నవంబర్ 7న స్వదేశానికి రానున్నారు. నవంబర్ 2న మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ జరగనుంది. నవంబర్ 6న ఓట్లను లెక్కించి ఫలితం వెల్లడిస్తారు. కాంగ్రెస్ క్రమశిక్షణా కమిటీ ఇచ్చిన డెడ్‌లైన్ నవంబర్ 2వ తేదీతో ముగుస్తుంది. అంటే పోలింగ్ జరగడానికి ముందే కోమటిరెడ్డి తన వివరణను పార్టీకి ఇవ్వాల్సి ఉంటుంది. తాజా పరిణామాలతో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడటం ఖాయమనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో సాగుతోంది.
Read Also: Chopper Flying on Road: వాహనాలపైకి దూసుకొచ్చిన హెలీక్యాప్టర్.. గూస్బంప్స్ వీడియో
Read Also: Revanth Reddy: రాహుల్ యాత్రలో రేవంత్ రెడ్డి హల్చల్.. మునుగోడు ఉపఎన్ని వేళ టీ కాంగ్రెస్ కు ఫుల్ జోష్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook