AAP in Telangana: తెలంగాణపై కన్నేసిన అరవింద్ కేజ్రీవాల్

Arvind Kejriwal focus on Telangana Politics: ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో పంజాబ్‌‌లో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టారు. ఈ ఏడాదిలో జరగబోయే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు అప్ అధినేత కేజ్రీవాల్.

Written by - ZH Telugu Desk | Last Updated : Mar 18, 2022, 09:58 PM IST
  • ఇటీవలి ఎన్నికల్లో పంజాబ్‌‌లో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ
  • వచ్చే నెలలో తెలంగాణకు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్
  • తెలంగాణలో పార్టీ విస్తరణపై ఇప్పటికే సెర్చ్ కమిటీ ఏర్పాట్లు
AAP in Telangana: తెలంగాణపై కన్నేసిన అరవింద్ కేజ్రీవాల్

Arvind Kejriwal focus on Telangana Politics: ఇటీవల జరిగిన ఎన్నికల్లో భారీ మెజార్టీతో పంజాబ్‌‌లో విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత కేజ్రీవాల్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. దేశ వ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో పార్టీ విస్తరణపై ఫోకస్ పెట్టారు. ఈ ఏడాదిలో జరగబోయే హిమాచల్ ప్రదేశ్, గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నారు అప్ అధినేత కేజ్రీవాల్. ఇదే తరుణంలో దక్షిణాది రాష్ట్రాల్లో పార్టీ విస్తరణ చేపట్టాలనే యోచనలో ఆ పార్టీ అధిష్టానం ఉంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వచ్చే నెలలో తెలంగాణ రాష్ట్రంలో పర్యటించబోతున్నట్టు తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా పాదయాత్ర చేపడుతామని ఇటీవలే ఆ పార్టీ నేతలు ప్రకటించారు. టీఆర్ఎస్ అసమర్థత పాలన, అవినీతి రహిత ప్రభుత్వం ఎజెండాగా పెట్టుకొని అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ప్రారంభించున్నట్టు సమాచారం. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతిని పురస్కరించుకొని యాత్ర ప్రారంభించబోతున్నట్టు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి.

తెలంగాణలో అవినీతి రహిత పాలన రహిత స్లోగన్‌తో దూసుకెళ్లేందుకు వ్యూహాలకు పదును పెడుతోంది. దేశ రాజధాని ఢిల్లీ ఆమ్ ఆద్మీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలో అప్పులు లేని రాష్ట్రంగా నిలిచింది. 4 లక్షల కోట్లు అప్పులు ఉన్న తెలంగాణను ఢిల్లీ మాదిరేగానే అప్పులు లేని రాష్ట్రంగా పాలన అందిస్తామని ఆప్ నేతలు చెబుతున్నారు. తెలంగాణ రాజకీయాల్లో ఇటీవల టీఆర్ఎస్, బీజేపీ నేతలు ఆరోపణలు చేసుకుంటూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అప్ నేతలు విమర్శలు చేస్తున్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయిందని ఆమ్ ఆద్మీ దక్షిణాది రాష్ట్రాల ఇన్‌ఛార్జి సోమనాథ్ భారతీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా దేశ వ్యాప్తంగా పర్యటిస్తూ వివిధ ప్రాంత్రీయ పార్టీల అధినేతలతో సీఎం కేసీఆర్ భేటీ అవుతూ వస్తున్నారు. ఇటీవల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం కేసీఆర్.. అరవింద్ కేజ్రీవాల్‌ని కలుస్తారని ప్రచారం జరిగినప్పటికీ అది వీలు కాలేదు. గత కొంతకాలంగా తెలంగాణ సర్కార్‌ను ఆమ్ ఆద్మీ పార్టీ నేతలు సీఎం కేసీఆర్‌ పాలనపై విమర్శనాస్త్రాలు చేస్తూ వస్తున్నారు. తెలంగాణలో తమకు యువత, రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఐఏఎస్ అధికారుల నుంచి తమకు మద్దతు ఉంటుందని అప్ నేతలు భావిస్తున్నారు. తెలంగాణలో పార్టీ విస్తరణపై ఇప్పటికే సెర్చ్ కమిటీ ఏర్పాట్లు చేసినట్టు తెలిసింది. వచ్చే ఏడాది చివరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికలలోపే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర చేపట్టాలని ఆమ్ ఆద్మీ పార్టీ (Aam Aadmi Party) యోచిస్తోంది.

Also read : Chinna Jeeyar: సమ్మక్క-సారలమ్మలపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై చినజీయర్ వివరణ...

Also read : Pegasas: తెరపైకి మరోసారి పెగాసస్.. బెంగాల్‌ అసెంబ్లీలో సీఎం మమతా బెనర్జీ కీలక వ్యాఖ్యలు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News