ఆధార్ లేదని.. పిల్లలకు ఆహారం కట్

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి ప్రాంతంలో గల అంగన్వాడీ కేంద్రాల్లో అనేకమంది గిరిజన పిల్లలు చదువుకుంటున్నారు. 

Last Updated : Jan 20, 2018, 05:03 PM IST
ఆధార్ లేదని.. పిల్లలకు ఆహారం కట్

ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి ప్రాంతంలో గల అంగన్వాడీ కేంద్రాల్లో అనేకమంది గిరిజన పిల్లలు చదువుకుంటున్నారు. అయితే వారి కుటుంబాల్లో చాలామందికి ఆధార్ కార్డు లేకపోవడంతో.. ఆధార్ సంఖ్యను దరఖాస్తుతో పాటు జత చేస్తేనే ఆ పిల్లలకు పౌష్టికాహారాన్ని సప్లై చేయగలమని అంటున్నారు అధికారులు. ఇటీవలే అదే ప్రాంతంలో ఓ ఎన్జీఓ సర్వే చేయగా దాదాపు 300 మంది పిల్లలకు పైగా ఆధార్ కార్డు లేదన్న కారణంతో ఆహారాన్ని నిలిపివేసినట్లు తేలింది. ప్రభుత్వ నిబంధనల ప్రకారంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ అంగన్వాడీ కేంద్రాలకు పాలు, రొట్టె,కోడిగుడ్లతో పాటు ఇతర పౌష్టికాహారాన్ని సరఫరా చేస్తుంటాయి.

అయితే ఇటీవలి కాలంలో ఏ ప్రభుత్వ పథకం ద్వారానైనా ప్రజలు సౌలభ్యాలు పొందాలని భావిస్తే.. దరఖాస్తులతో పాటు ఆధార్ సంఖ్యను కూడా పథకానికి లింక్ చేసుకోవాలని సర్కార్ తెలిపింది. ఈ క్రమంలో పిల్లల ఆధార్ సంఖ్యలు కూడా వారి తల్లిదండ్రులు నమోదు చేయించాలని అంగన్వాడీ అధికారులు తెలిపారు. అయితే ఆ అంగన్వాడీ చుట్టు ప్రక్కల గ్రామాలు అన్నీ కూడా గిరిజన ఆదివాసీ ప్రాంతాలు కావడంతో వారిలో చాలామంది ఆధార్ కార్డు అంటే కూడా అవగాహన లేకపోవడం గమనార్హం. ప్రస్తుతం పిల్లలకు ఆహారాన్ని నిలిపివేశాక... ఆధార్ అంటే ఏమిటో తెలిపమని అధికారులను అడుగుతున్నారు కొందరు గిరిజనులు. 

Trending News