శ్రామిక్ రైలులో మహిళ ప్రసవం..!!

'కరోనా వైరస్' కారణంగా దేశంలో ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన వలస కూలీల కోసం కేంద్రం ప్రత్యేకంగా శ్రామిక్ రైళ్లు నడిపిస్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 200 రైళ్లు నడిపినట్లు  తెలుస్తోంది. దీంతో వలస కార్మికులు తమ స్వస్థలాలకు  చేరుకుంటున్నారు. 

Last Updated : May 24, 2020, 08:21 AM IST
శ్రామిక్ రైలులో మహిళ ప్రసవం..!!

'కరోనా వైరస్' కారణంగా దేశంలో ఎక్కడికక్కడ చిక్కుకుపోయిన వలస కూలీల కోసం కేంద్రం ప్రత్యేకంగా శ్రామిక్ రైళ్లు నడిపిస్తోంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 200 రైళ్లు నడిపినట్లు  తెలుస్తోంది. దీంతో వలస కార్మికులు తమ స్వస్థలాలకు  చేరుకుంటున్నారు. 

మరోవైపు నిన్న తెలంగాణ నుంచి ఒడిషాకు బయల్దేరిన ప్రత్యేక శ్రామిక్ రైలులో ఓ నిండు గర్భిణీ పండంటి బిడ్ఢకు జన్మనిచ్చింది. సికింద్రాబాద్ నుంచి బయల్దేరిన శ్రామిక్ రైలులో ఓ వలసకార్మికుని భార్య ఎక్కింది. ఆమె నిండు గర్భిణీ కావడంతో అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు రైల్వే అధికారులు. ఐతే ఆమెకు మార్గమధ్యంలోనే ప్రసవం అయింది. ఐతే రైల్వే వైద్య సిబ్బంది ఆమెకు  డెలివరీ చేశారు.

ఆ తర్వాత ఒడిశాలోని బాలంగీర్ కు శ్రామిక్ రైలు చేరుకుంది. దీంతో అక్కడే ఆమెను ఆస్పత్రిలో చేర్పించారు. తల్లీ, బిడ్డ.. ఇద్దరూ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..

Trending News