Fire accident: కేపీహెచ్​బీలో భారీ అగ్నిప్రమాదం- పూర్తిగా కాలిపోయిన థియేటర్!

Fire accident: హైదరాబాద్​లోని కేపీహెచ్​బీలో  భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఓ థియేటర్లో జరిగిన ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిళ్లింది.

Written by - ZH Telugu Desk | Edited by - ZH Telugu Desk | Last Updated : Jan 3, 2022, 09:12 AM IST
  • హైదారాబాద్​లో భారీ అగ్ని ప్రమాదం
  • కేపీహెచ్​బీలోని ఓ థియేటర్లో మంటలు
  • తెల్లవారు జామున కావడంతో తప్పిన ప్రాణ నష్టం
Fire accident: కేపీహెచ్​బీలో భారీ అగ్నిప్రమాదం- పూర్తిగా కాలిపోయిన థియేటర్!

Fire accident: హైదరాబాద్​లోని కేపీహెచ్​బీ పరిధిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శివ పార్వతి థియేటర్​లో భారీగా అగ్ని కీలలు (Fire accident in Shiva Parvathi theater) ఎగిసిపడ్డాయి. అగ్ని కీలకల ధాటికి థియేటర్ పైకప్పు కూలింది. థియేటర్ పూర్తిగా మంటల్లో కాలిపోయింది.

థియేటర్​ సెక్యూరిటీ గార్డ్​ ఇచ్చిన సమాచారం మేరకు.. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని.. మంటలను (Fire accident in KPHB) అదుపు చేశారు. తెల్లవారు జామున మూడున్నర గంటల సమయంలో ప్రమాదం చోటు చేసుకోవడంతో.. థియేటర్లో ఎవరూ లేరని అందువల్లే ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. మంటలను అదుపు చేసేందుకు దాదాపు మూడు గంటల సమయం పట్టిందని చెప్పారు.

అయితే ఆస్తి నష్టం మాత్రం భారీగా జరిగినట్లు వెల్లడించారు థియేటర్ (Fire accident in Hyderabd)​ యాజమానులు. సుమారు రూ.2 కోట్ల వరకు ఆస్తి మంటల్లో కాలి బూడిదైనట్లు తెలిపారు.

ప్రమాద సమాచారం అందుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. షార్ట్​ సర్క్యూట్​ వల్లే (Short circuit in Theater) మంటలు అంటుకుని ఉండొచ్చని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

Also read: Gang War: ఎల్​బీ నగర్​లో మందుబాబుల మధ్య గొడవ- ఓ యువకుడు మృతి!

Also read: Hyderabad: మిఠాయి పాడైందని నెటిజన్ ట్వీట్...జీహెచ్ఎంసీ రియాక్షన్.. కరాచీ బేకరీకి రూ.10వేల జరిమానా!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News