TSRTC ప్రత్యేక బస్సుల్లో 50% అదనపు బాదుడు

TSRTC : నష్టాల నుంచి బయటపడేందుకు టీఎస్ఆర్టీసీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందుకే ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీల వసూలు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 4, 2022, 10:45 AM IST
  • టీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం
  • ప్రత్యేక బస్సుల్లో 50% అదనపు బాదుడు
TSRTC ప్రత్యేక బస్సుల్లో 50% అదనపు బాదుడు

TSRTC : కరోనా కారణంగా నష్టాల బాట పట్టిన టీఎస్ఆర్టీసీ (TSRTC) ఇంకా తేరుకోలేదు. ఇప్పుడిప్పుడే కాస్త గాడిన పడుతున్న తరుణంలో..ఒమిక్రాన్ (Omicron) విజృంభించటంతో మళ్లీ పరిస్థితి మెుదటికి వచ్చింది. ఆర్టీసీని నష్టాల ఊబి నుంచి గట్టెక్కేంచేందుకు అధికారులు శాయశక్తులా కృషి చేస్తున్నారు. తాజాగా ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీల వసూలుపై టీఎస్ఆర్టీసీ దృష్టి కేంద్రీకరించింది. 

ముచ్చింతల్‌లో జరుగుతున్న శ్రీరామానుజ సహస్రాబ్ది సమారోహ వేడుకలకు హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాల నుంచి నడిపే ప్రత్యేక బస్సుల్లో (Special Buses) 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయాలని  టీఎస్‌ఆర్టీసీ గురువారం ఉత్తర్వులు జారీచేసింది. అదే విధంగా  సమ్మక్క-సారలమ్మ జాతరకు ఈ నెల 13 నుంచి నడిపే ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీల వసూలుపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని, కసరత్తు జరుగుతోందని అధికారులు తెలిపారు. 

అయితే దసరా, సంక్రాంతి సమయాల్లో నడిపిన ప్రత్యేక బస్సుల్లో అదనపు ఛార్జీలు వసూలు చేయని టీఎస్ఆర్టీసీ..ఇప్పుడు వసూలు చేయడం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. గత ఏడాది జనవరిలో ఆర్టీసీకి రూ.337.79 కోట్ల ఆదాయం రాగా.. ఈ ఏడాది జనవరిలో ఆ మొత్తం రూ.287.07 కోట్లకే పరిమితమైంది. రూ.51 కోట్ల ఆదాయం తగ్గింది.

Also Read: TSRTC: ముచ్చింతల్‌లో Statue of Equality విగ్రహావిష్కరణ.. హైదరాబాద్ నుంచి ముచ్చింతల్ కు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News