హైదరాబాద్: తెలంగాణలో పంచాయతి ఎన్నికల షెడ్యూల్ ప్రకారం జరగనున్న రెండో విడత పోలింగ్ శుక్రవారం ఉదయం ప్రారంభమైంది. 2వ విడత పోలింగ్లో మొత్తం 4,135 గ్రామ పంచాయతీలకు నోటిఫికేషన్ వెలువడగా అందులో 788 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం కాగా మరో 3,342 సర్పంచ్ స్థానాలకుగాను 10,668 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. మరో ఏడు గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్లే దాఖలు కాలేదు. మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుండగా, మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. కౌంటింగ్ ప్రారంభమైన అనంతరం కొద్దిసేపట్లోనే ఫలితాలు వెల్లడికానున్నాయి.