Medchal Road Accident: మేడ్చల్‌ చెక్‌పోస్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం...ఇద్దరు మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు

Road Accident: మద్యం మత్తులో వాహనం నడపటంతో.. మేడ్చల్‌ చెక్‌పోస్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా.. ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.   

Edited by - ZH Telugu Desk | Last Updated : Mar 2, 2022, 11:01 AM IST
Medchal Road Accident: మేడ్చల్‌ చెక్‌పోస్టు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం...ఇద్దరు మృతి, ఏడుగురికి తీవ్ర గాయాలు

Medchal Road Accident news: మేడ్చల్‌ చెక్‌పోస్టు వద్ద మంగళవారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మృతి చెందగా..మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వేగంగా వస్తున్న కారు డివైడర్‌పైకి దూసుకెళ్లడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదం జరిగిన సమయంలో కారులో 9 మంది ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. క్షతగాత్రులను గాంధీ ఆసుపత్రికి (Gandhi Hospital) తరలించి చికిత్స చేయిస్తున్నారు. 

డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడిపాడు. దీంతో కారు అదుపుతప్పి మేడ్చల్ (Medchal) చెక్ పోస్ట్ బావర్చి హోటల్ దగ్గర డివైడర్‌పైకి దూసుకెళ్లింది. అతివేగంగా రామాయంపేట్ నుంచి నగరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన వారిని గోరి సింఘ్, బబ్లీ సింఘ్ గా గుర్తించారు. వీరంతా మధ్యప్రదేశ్ (Madhya Pradesh) నుంచి బతుకు దెరువు కోసం మేడ్చల్ వచ్చిన కూలీలుగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఒకరిని మేడ్చల్ ప్రభుత్వాసుపత్రికి, మరొకరిని గాంధీకి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 

Also read: Viral Video: ట్రాక్ట‌ర్‌తో ర‌ష్యా యుద్ధ ట్యాంకును లాక్కెళ్లిన ఉక్రెయిన్ రైతు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News