ఊరు పొమ్మంటుంది.. కాడు రమ్మంటుంది.. అనేది పాత సామెత. సాధారణంగా ఈ సామెతను వయో వృద్ధులు వాడుతుంటారు. అంటే వయసు అయిపోయింది.. అన్నీ చూశాం.. ఇక చనిపోవడమే మిగిలి ఉందనేది దాని అర్థం. అంటే ఊరులో నుంచి ఊరి చివర ఉన్న వల్లకాడులోకి వెళ్లిపోతామని చెబుతుంటారు. కానీ ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పుడు అదే పరిస్థితి వచ్చింది.
కరోనా వైరస్ కారణంగా ఈ పరిస్థితి దాపురించింది. ఆదిలాబాద్ జిల్లా నేరేడుకొండ అనే మండల కేంద్రంలో ముగ్గురు వ్యక్తులకు కరోనా వైరస్ సోకిందనే వార్త గుప్పుమంది. ఇంతలోనే శనివారం వైద్యులు పరీక్షలు నిర్వహించగా ఒక్కరోజే 10 మందికి కరోనా వైరస్ లక్షణాలు బయటపడ్డాయి. దీంతో జనంలో ఆందోళన ఎక్కువైంది.
కరోనా వైరస్ వచ్చిన వారిని ఇళ్లకే పరిమితం చేశారు. కానీ జనం భయాందోళన కారణంగా ఊరు విడిచి వెళ్లిపోతున్నారు. ఎవరికి వారు ఇళ్ల నుంచి పొలాల బాట పట్టారు. పొలాల్లోనే తాత్కాలిక టెంట్లు వేసుకుని పిల్లలతో సహా అక్కడికి తరలి వెళ్లిపోయారు. మొత్తం ఈ ఊళ్లో నుంచి 150 కుటుంబాలు పొలాల్లో టెంట్లు వేసుకోవడం విశేషం.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
ఊరు పొమ్మనలేదు.. కానీ వెళ్లిపోతున్నారు..!!