పాతబస్తీలో ఎంఐఎం పాతుకుపోవడానికి 10 కారణాలు

                          

Last Updated : Sep 20, 2018, 04:42 PM IST
పాతబస్తీలో ఎంఐఎం పాతుకుపోవడానికి 10 కారణాలు

హైదరాబాద్: ఒకవైపు మత విద్వేషాలు, ఉగ్రమూలాలు మరోవైపు ఇరుకు గల్లీలు, అగ్గిపెట్టెలాంటి ఇళ్లల్లో పూటగడవని పేదరికానికి  చిరునామా పాత బస్తీ. ఇటువంటి పరిస్థితుల్లో కూడా ఓల్డ్ సిటీలో తన పట్టుసడలకుండా మూడు దశాబ్దాలకు పైగా ఎంఐఎం ఎలా ఏలగల్లుతోంది. ఇతర పార్టీలకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా ఎలా మనుగడ సాధించగల్గుతోందనే ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమౌతోంది. దీనికి అనేక కారణాలు ఉన్నప్పటికీ ప్రధానంగా కొన్ని కారణాల వల్ల పాతబస్తీలో ఎంఐఎం మనుగడను సాధించగల్లుతోందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇంతకీ ఆ కారణాలు ఏంటో ఒక్కసారి తెలుసుకుందామా..

ప్రధాన  కారణాలు ఇవే: 
* పార్టీ చీఫ్ నుంచి కింది స్థాయి నేత వరకు నిత్యం ప్రజల్లో ఉండటం
* అభివృద్ధి కంటే జనాల సమస్యలకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం 
* బూత్ స్థాయి కమిటీలు నిత్యం క్రియాశీలంగా ఉండటం .
*  ఇంటింటి సమాచారం పక్కాగా తెలిసి ఉండటం
* అధికారంలో ఏ పార్టీ ఉంటే ఆ పార్టీతో జత కట్టడం
*  ఎన్నికల సమయంలో హిందూ ఓట్లను చీల్చడంలో సఫలమవడం
*  ఈ చిన్న కార్యకర్త పిలిచినా పిలిచినా వివాహ, శుభకార్యాలకు నేతలు తప్పక హాజరుకావడం
* విద్యాసంస్థలు, ఆస్పత్రి ఏర్పాటు చేసి జనాలకు సేవలు అందించడం
* అధిష్టానం గీసిన గీత దాటితే వేటు పడే క్రమ శిక్షణ కలిగి ఉండటం
*  ఓవైసీ బ్రదర్స్ వాదన పటిమ

వీటితో పాటు ఓవైసీ బ్రదర్స్ అనుసరించే అనేక వ్యూహాల వల్ల ఓల్డ్ సిటీలో దశాబ్దాలుగా కంచుకోట తయారైందనే రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. 

Trending News