BJP MLA Paidi Rakesh Reddy Fire On CM Revanth Reddy: ఉత్తర తెలంగాణపై కాంగ్రెస్ నేతలు పగబట్టారని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. బడ్జెట్ లో ఉత్తర తెలంగాణకు అన్యాయం చూసి, నిధులన్ని దక్షిణ తెలంగాణ.. ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ కు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. కేవలం రెండు నెలల్లోనే వేల కోట్లు దోచుకుపోయారన్నారు. కొడంగల్ కు మూడువేల కోట్లు, నల్లగొండకు మంత్రులు నిధులు తీసుకెళ్తున్నారని మండిపడ్డారు.
Read More: Samyuktha Menon: గుర్రమెక్కిన భీమ్లా నాయక్ భామ సంయుక్తా మీనన్.. లేటెస్ట్ పిక్స్ వైరల్..
ఆర్మూర్ పై తెలంగాణ కాంగ్రెస్ నేతలు పగ పట్టారని, అందుకే నిధులు కేటాయించట్లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉత్తర తెలంగాణలోని జిల్లాలు వెనుకబడిఉన్నాయన్నారు. గత పదేళ్లలో తమ నియోజక వర్గం ఆర్మూర్ డెవలప్ మెంట్ కు నోచుకోలేదన్నారు. ఖమ్మం ప్రాజెక్టుల మీద రివ్యూలు జరుపుతున్నారు కానీ.. ఆర్మూర్ ను పట్టించుకోవట్లేదన్నారు. ఇప్పటికే తెలంగాణకు కాంగ్రెస్ ప్రథమ శత్రువున్నారు. దేశాన్ని చీల్చింది కాంగ్రెస్.. తెలుగు రాష్ట్రాలను విడదీసింది కాంగ్రెస్ పార్టీ అని పైడి రాకేష్ రెడ్డి గుర్తు చేశారు.
పార్టీలకు అతీతంగా రాజకీయ పార్టీలు ముందుకు రావాలని అన్నారు. ఎవరైన ఓడిపోయిన నాయకులు, కాంగ్రెస్ నేతలు రాజకీయాలకు అతీతంగా ముందుకు వచ్చి ప్రజలకు న్యాయం చేసేలా ముందడుగు వెద్దామని ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పిలుపునిచ్చారు. ఆర్మూర్ లో ఓడిపోయిన కాంగ్రెస్ నేతలు, బీఆర్ఎస్ పార్టీ నేతలు, బీజేపీ వారిని ఇబ్బందులకు గురిచేయాలని చూస్తున్నారన్నారు.
Read More: Honey Rose: రెడ్ ట్రెండ్ ని ఫాలోఅయిన హనీ రోజ్.. కానీ కొంచెం డిఫరెంట్ గా!
వెంటనే .. ఇలాంటి పనులను వదులుకొవాలని లేకపోతే తీవ్రస్థాయిలో పరిణామాలుంటాయని ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి హెచ్చరించారు. దీంతో ప్రస్తుతం ఉత్తర తెలంగాణ వర్సెస్ దక్షిణ తెలంగాణల మధ్య నిధుల కేటాయింపు అనేది హీట్ ను పుట్టిస్తుంది. ఇది ఎలాంటి కొత్త సమస్యలకు ఆజ్యం పోస్తుందో అంటూ రాజకీయ పండితులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Paidi Rakesh Reddy: ఉత్తర తెలంగాణపై పగబట్టారు.. సీఎం రేవంత్ రెడ్డిపై మండిపడిన బీజీపీ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి..
- సీఎం రేవంత్ ఫైర్ అయిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి..
- ఉత్తర తెలంగాణకు నిధులను కేటాయించట్లేదంటూ వ్యాఖ్యలు..