Zomato Launches Pure Veg Mode: ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫారమ్ జొమాటో కీలక నిర్ణయం తీసుకుంది. శాఖాహార వినియోగదారుల కోసం కొత్తగా ఫ్యూర్ వెజ్(Zomato Pure Veg Mode) ఫుడ్ డెలివరీని ప్రరంభించింది. వెజ్ కస్టమర్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) దీపిందర్ గోయల్ వెల్లడించారు. అయితే ఈ సేవలు త్వరలోనే అందుబాటులోకి రాబోతున్నట్లు తెలిపారు. ఈ ఫ్యూర్ వెజ్ ఫుడ్ డెలివరీ ద్వారా కేవలం స్వచ్ఛమైన శాఖాహార హోటల్స్, రెస్టారెంట్స్ అనుసంధానంతో ఆహారాన్ని అందించబోతున్నట్లు వెల్లడించారు.
వెజ్ లవర్స్ కోసమే కీలక నిర్ణయం:
వెజ్ వినియోగదారుల నుంచి వచ్చిన స్పందన మేరకే ఈ ఫ్యూర్ వెజ్(Zomato Pure Veg Mode) ఫుడ్ డెలివరీని ప్రరంభించిన్నట్లు దీపిందర్ గోయల్ తెలిపారు. అంతేకాకుండా భారత్‌లో 100 శాతం శాఖాహార ఆహారాన్ని అందించేందుకు కొత్తగా జొమాటో 'ప్యూర్ వెజ్ ఫ్లీట్'ను ప్రారంభించదన్నారు. ఈ కొత్త నిర్ణయాన్ని దీపిందర్ గోయల్ తన సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ 'ఎక్స్' ద్వారా షేర్ చేశాడు. అన్ని దేశాల్లోని ప్రజలు నాన్‌వెజ్ తినేవారి కంటే వెజ్ ఎక్కువగా తినేవారున్నారని, దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. అంతేకాకుండా ఇటీవలే వెజ్ కస్టమర్ల నుంచి వచ్చి ఫీడ్ బ్యాక్ కారణంగా కూడా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
జొమాటో(Zomato) సిఈవో గోయల్ మాట్లాడుతూ..వెజ్ తినేవారు ఇంట్లో ఎలాగైతే ఆహారాలు వండుకుంటారో.. అలాంటి ఫ్యూర్ రెస్టారెంట్ల నుంచే ఫుడ్ డెలివరీ చేస్తారని..తమ కస్టమర్స్ ఎక్కువగా ప్రధాన్యత చూపే ఆహారాలను మాత్రమే డెలివరీ చేస్తారన్నారు. 100 శాతం శాఖాహార ఆహారాన్ని ఇష్టపడే కస్టమర్ల కోసం Zomatoలో ఫ్యూర్ వెబ్ ఫ్లీట్ డెలివరీ ప్రారంభించారన్నారు. ఈ నిర్ణయం బిజినెస్ కోసం, రాజకీయాల కోసం కాదని స్పష్టం చేశారు. అయితే కొంత మంది సోషల్ మీడియాలో కావాలనే వెబ్ ఫ్లీట్ డెలివరీని తప్పుగా ట్రోల్ చేస్తున్నారన్నారు.
ఇక నుంచి వెజ్ ఫుడ్‌కి బక్స్ వేరే రంగు:
జొమాటో(Zomato) ఫ్యూర్ వెజ్ కస్టమర్స్ కోసం గ్రీన్ బాక్స్‌ల్లో డెలివరీ చేయబోతున్నట్లు తెలుపింది. ఇంతక ముందు కంపెనీ తమ వెజ్, నాన్‌వెజ్ కస్టమర్స్ కోసం రెడ్ బాక్స్‌ను మాత్రమే వినియోగించేది. అయితే స్వచ్ఛమైన శాఖాహారులను దృష్టిలో పెట్టుకుని గ్రీన్ బాక్స్‌ల్లో ఆహారాలను డెలివరీ చేయబోతున్నట్లు తెలిపింది. అంతేకాకుండా ముందుగా కంపెనీ కొన్ని ఫ్యూర్ వెజ్ రెస్టారెంట్ల నుంచి ఆర్డర్‌లను డెలివరీ చేస్తారని వెల్లడించింది. ఈ గ్రీన్ బాక్సుల్లో ఎటువంటి మాంసాహార ఆహారాన్ని డెలివరీ చేయబోమని గోయల్ స్పష్టం చేశారు. అంతేకాకుండా గ్రీన్ కలర్ బాక్స్ కలిగిన డెలివరీ బాయిస్ నానవెజ్ రెస్టారెంట్లలోకి వెళ్ల కూడదని తెలిపారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి