WhatsApp New Feature: వాట్సప్ నుంచి త్వరలో అద్భుతమైన ఫీచర్, ఇకపై స్టేటస్‌లో ఆడియో కూడా..

Whatsapp New Feature: వాట్సప్ యూజర్లకు గుడ్‌న్యూస్. ఇప్పుడు సరికొత్త ఫీచర్ ప్రవేశపెట్టనుంది. ఆ ఫీచర్ ఏంటో తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Nov 27, 2022, 04:19 PM IST
  • త్వరలో వాట్సప్‌లో సరికొత్త ఫీచర్, ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఫీచర్
  • ఇకపై వాట్సప్‌లో ఆడియో కూడా స్టేటస్‌గా పెట్టుకునే అవకాశం
  • 30 సెకన్ల ఆడియోను వాట్సప్ స్టేటస్‌గా పెట్టుకునే సౌలభ్యం
WhatsApp New Feature: వాట్సప్ నుంచి త్వరలో అద్భుతమైన ఫీచర్, ఇకపై స్టేటస్‌లో ఆడియో కూడా..

WhatsApp New Feature: వాట్సప్‌ను మరింత ఆకర్షణీయంగా మార్చేందుకు మెటా ఎప్పటికప్పుడు వాట్సప్‌లో కొత్త ఫీచర్లు ప్రవేశపెడుతోంది. ఇప్పుుడు స్టేటస్‌కు సంబంధించిన మరో కొత్త ఫీచర్ అందుబాటులో రానుంది. అదేంటో తెలుసుకుందాం..

యూజర్లను మరింతగా ఆకట్టుకునేందుకు వాట్సప్ ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లు అందిస్తుంటుంది. యూజర్లకు కావల్సిన అద్భుతమైన వేదికగా వాట్సప్‌ను మార్చడమే ప్రధాన ఉద్దేశ్యం. వాట్సప్‌లో స్టేటస్ ఫీచర్ అందరూ తప్పకుండా వినియోగిస్తుంటారు. ఇందులో వీడియో, టెక్స్ట్ మాత్రమే అప్‌డేట్ చేయగలరు. అయితే ఇప్పుడీ స్టేటస్ ఫీచర్‌లో కీలకమైన మార్పు రానుంది. ఇప్పుడిక స్టేటస్ అప్‌డేట్ కోసం కొత్త ఆప్షన్ వస్తోంది.

స్టేటస్‌లో ఆడియో సెట్ చేసుకునే సౌలభ్యం

ఇప్పటివరకూ వాట్సప్ యూజర్లు స్టేటస్‌లో కేవలం టెక్స్ట్, వీడియోలు, ఫోటోలు మాత్రమే పెట్టుకునే వీలుందని అందరికీ తెలిసిందే. కానీ ఇప్పుడిక ఇందులో కొత్త ఫార్మట్ రానుంది. అది ఆడియో. అంటే ఇక నుంచి వాట్సప్ యూజర్లు ఫోటోలు, వీడియోలు, టెక్స్ట్‌తో పాటు ఆడియో కూడా స్టేటస్‌గా పెట్టుకోవచ్చు. ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్ త్వరలో అధికారికంగా లాంచ్ కానుంది. ఈ ఫీచర్ ప్రస్తుతానికి ఐవోఎస్ వెర్షన్‌లో గుర్తించారు. యూజర్లు 30 సెకన్ల ఆడియోను స్టేటస్‌లో పెట్టుకోవచ్చు.

ఈ ఫీచర్ సహాయంతో ఇప్పుడు యూజర్లు స్వల్ప వ్యవధిలోనే తమ వాయిస్ రికార్డ్ చేసి స్టేటస్‌లో అప్‌డేట్ చేయవచ్చు. మీ ఈ స్టేటస్‌ను ప్రతి ఒక్కరూ వినగలరు. హైడ్ చేయలేరు. ఇది ఒరిజినల్ మాత్రమే ఉంటుంది. ఎందుకంటే మీరు మీ గొంతుతో రికార్డ్ చేస్తారు. అయితే యూజర్లు కేవలం 30 సెకన్లు మాత్రమే స్టేటస్‌గా పెట్టుకోవచ్చు. అందుకే స్టేటస్ ఆడియోను కేవలం 30 సెకన్ల కోసమే రికార్డు చేయాలి.

Also read: Diabetes Control: డయాబెటిస్‌తో ఇబ్బంది పడుతున్నారా..ఈ 4 పదార్ధాలతో 5 వారాల్లో చెక్ చెప్పేయండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News