Whatsapp: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. చిటికెలో కాలింగ్..!

WhatsApp Calling Shortcut: వాట్సాప్ ఎప్పటికప్పుడు సరికొత్త అప్‌డేట్స్‌తో యూజర్లకు సరికొత్త అనుభూతినిస్తోంది. ఇటీవలె మెసేజ్ యువర్ సెల్ఫ్‌ అప్‌డేట్ తీసుకువచ్చిన వాట్సాప్.. కాలింగ్ షార్ట్‌కట్ ఫీచర్‌ను పరిచయం చేయనుంది. ఇది పనిచేయనుందంటే..?  

Written by - ZH Telugu Desk | Last Updated : Feb 3, 2023, 02:26 PM IST
Whatsapp: వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్.. చిటికెలో కాలింగ్..!

WhatsApp Calling Shortcut: ప్రస్తుతం సోషల్ మీడియా యాప్‌ల వినియోగం భారీగా పెరిగిపోయింది. ఉదయం నిద్ర లేవడం మొదలు.. రాత్రి కనురెప్ప మూసేవరకు చాలా మంది సోషల్ మీడియాలోనే మునిగి తేలుతున్నారు. వాట్సాప్, ఫేస్‌బుక్ మెసేంజర్, ఇన్స్‌స్టాగ్రామ్ వంటి యాప్‌లలో చాటింగ్‌లతో బిజీగా మారిపోయారు. వీటిలో ఎక్కువమంది యూజర్లు వాడుతున్న యాప్ మాత్రం వాట్సాప్. ఈ యాప్‌ ఎప్పటికప్పుడు సరికొత్త అప్‌డేట్స్‌తో యూజర్లకు కొత్త అనుభూతిని ఇస్తోంది. తాజాగా మరో అప్‌డేట్‌తో వినియోగదారుల ముందుకు వచ్చింది. తాజా అప్‌డేట్‌లో వాట్సాప్ కాలింగ్, మెసేజింగ్‌తో సహా అనేక సేవలు మరింత సులభతరం కానున్నాయి.

అదేవిధంగా భద్రత విషయంలో కూడా వాట్సాప్ మార్పులు చేస్తూనే ఉంది. ఇప్పుడు వాట్సాప్ కొత్త ఫీచర్‌పై పనిచేస్తోంది. కాలింగ్ షార్ట్‌కట్‌లను సృష్టించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. కొత్త ఫీచర్‌తో కాంటాక్ట్స్‌ జాబితాలోని పేరుపై నొక్కడం ద్వారా నేరుగా కాలింగ్ వెళుతుంది. ఈ అప్‌డేట్ చేసుకున్న వెంటనే యాప్‌కి కొత్త కాలింగ్ షార్ట్‌కట్ యాడ్ అవుతుంది. ఒకే వ్యక్తికి కాల్ చేసిన ప్రతిసారి పేరు సర్చ్ చేయకుండా ఈ ఫీచర్ షార్ట్ కట్‌గా ఉపయోగపడుతుంది. 

కాలింగ్ షార్ట్‌కట్‌లను సృష్టించే సామర్థ్యం ప్రస్తుతం డెవలప్‌మెంట్ దశలో ఉంది. త్వరలోనే వాట్సాప్‌ అప్‌డేట్‌లో విడుదల చేయనున్నారు. ప్లాట్‌ఫారమ్ డ్రాయింగ్ టూల్ హెడర్‌లో కొత్త సెట్టింగ్‌ల గుర్తును ఏకీకృతం చేయాలని యోచిస్తోంది వాట్సాప్. ఇది వినియోగదారులు ఏదైనా ఫోటో నాణ్యతను ఎడిట్ చేయడానికి అనుమతిస్తుంది. వారు పంపుతున్న ఫోటో నాణ్యతపై వారికి మరింత నియంత్రణను ఇస్తుంది. 

ఇటీవలె మెసేజ్ యువర్ సెల్ఫ్‌ అప్‌డేట్‌ వాట్సాప్‌ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వినియోగదారులు తమకు తామే సందేశాలు పంపుకునే అవకాశం కల్పిచింది. ఈ సదుపాయంతో అనేక రకాల పనులు చేసుకోవచ్చు. గుర్తుంచుకోవడానికి నోట్స్ తయారు చేయడం, చేయవలసిన జాబితాలను తయారు చేయడం, షాపింగ్ జాబితాలు వంటివి సిద్ధం చేసుకుని మెసేజ్ పెట్టుకోవచ్చు. ఇది వినియోగదారులందరికీ అందుబాటులోకి వచ్చింది. టెక్ట్స్ మెసేజ్ మాత్రమే కాకుండా.. మీకు మీరు వాయిస్ మెమోలను కూడా పెట్టుకోవచ్చు.

Also Read: MS Dhoni: పోలీస్ ఆఫీసర్‌గా ఎంఎస్ ధోని.. లుక్ అదిరిపోయిందిగా..  

Also Read: Secretariat Fire Accident: కొత్త సచివాలయం అగ్నిప్రమాద ఘటనలో ట్విస్ట్.. కారణం అదేనా..?   

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News