Vivo V40 Pro Price: భారత మార్కెట్‌లో ప్రీమియం సెల్పీ కెమెరా కలిగిన స్మార్ట్‌ఫోన్స్‌కి మంచి డిమాండ్ ఉంది. దీంతో చాలా కంపెనీలు ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి కొత్తకొత్త మొబైల్స్‌ను విడుదల చేస్తున్నాయి. అంతేకాకుండా వీటిని అతి తక్కువ ధరల్లోనే లాంచ్ చేయడంతో చాలా మంది యువత ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. మీరు కూడా ఎప్పటి నుంచో 50MP సెల్ఫీ కెమెరాతో కూడిన మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. ఇది అద్భుతమైన ఫ్రంట్ కెమెరాతో అందుబాటులోకి వచ్చింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవలే వీవో నుంచి మార్కెట్‌లోకి లాంచ్ అయిన 50MP సెల్ఫీ కెమెరా కలిగిన స్మార్ట్‌ఫోన్స్‌లో Vivo V40 Pro 5G ఒకటి. ఇది 12GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో పాటు ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై లాంచింగ్ ఆఫర్స్‌లో భాగంగా అతి తక్కువ ధరలకే మొబైల్స్ లభిస్తున్నాయి. ప్రస్తుతం ఇది ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. మార్కెట్‌లో 512GB ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన స్మార్ట్‌ఫోన్ ధర రూ.55,999 కాగా ఫ్లిఫ్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే దాదాపు రూ. 5,600పై తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా ఎక్చేంజ్ ఆఫర్స్‌ను వినియోగించి కొనుగోలు చేసేవారికి దాదాపు రూ. 5,600 వరకు బోనస్ లభిస్తుంది.
ఈ స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా ఎక్చేంజ్ ఆఫర్స్ వివియోగించాలనుకునేవారు తప్పకుండా పాత మొబైల్‌ను ఎక్చేంజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే డిస్కౌంట్ లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఇది పాత మొబైల్ కండీషన్‌పై ఆధారపడి ఉంటుంది. మొబైల్ కండీషన్ బాగుంటేనే ఈ తగ్గింపు లభిస్తుంది. ప్రస్తుతం ఈ ఇది మార్కెట్‌లో రెండు కలర్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ఇవే కాకుండా ఈ Vivo V40 Pro 5G స్మార్ట్‌ఫోన్‌పై అదనంగా ఇతర డిస్కౌంట్ ఆఫర్స్ కూడా లభిస్తున్నాయి.
ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
6.78-అంగుళాల ఫుల్ HD+ కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే
50MP ప్రధాన కెమెరా
ట్రిపుల్ కెమెరా సెటప్
ZEISS టెలిఫోటో పోర్ట్రెయిట్ కెమెరా
కర్వ్డ్ డిస్‌ప్లే
2x ఆప్టికల్ జూమ్ సపోర్ట్
50X ZEISS హైపర్ జూమ్
మీడియాటెక్ డైమెన్సిటీ 9200+ ప్రాసెసర్
5500mAh బ్యాటరీ
50MP అల్ట్రా-వైడ్ సెన్సార్ కెమెరా
50MP టెలిఫోటో కెమెరా
50MP ఫ్రంట్ కెమెరా
80W ఫ్లాష్ ఛార్జ్ సపోర్ట్
ఇది కూడా చదవండి: Lakshmi Narayana Raja Yoga: లక్ష్మీ నారాయణ రాజయోగం ఏర్పాటు.. ఈ రాశుల వారు కుబేరులు కాబోతున్నారు..
ఇది కూడా చదవండి: 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.