Vivo T3 5G Design Leaked: చీప్‌ ధరలోనే కళ్లు చెదిరే డిజైన్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!

Vivo T3 5G Amazing Design Leaked: అతి తక్కువ ధరలోనే ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 స్మార్ట్‌ఫోన్‌ రానుంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌, డిజైన్‌ సోషల్ మీడియాలో లీక్‌ అయ్యాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకోండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 12, 2024, 12:33 PM IST
Vivo T3 5G Design Leaked: చీప్‌ ధరలోనే కళ్లు చెదిరే డిజైన్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్.. ఫుల్ డీటెయిల్స్ ఇవే!

Vivo T3 5G Amazing Design Leaked: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్స్‌ కంపెనీలు తక్కువ ధరల్లోనే ప్రీమియం ఫీచర్స్‌ కలిగిన మొబైల్స్‌ను లాంచ్‌ చేస్తున్నాయి. ప్రముఖ స్మార్ట్‌ఫోన్‌ తయారీ కంపెనీ వీవో కూడా మరో ముందడు వేసింది. వీవో త్వరలోనే మార్కెట్‌లోకి శక్తివంతమైన స్పెషిఫికేషన్స్‌, ఫీచర్స్‌ కలిగిన మొబైల్‌ను లాంచ్ చేయబోతోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్యాక్‌ సెటప్‌లో మూడు కెమెరాలతో అందుబాటులోకి రానుంది. అలాగే ఇది వెనుకవైపు గుండ్రని LED ఫ్లాష్‌తో లభించనుంది. దీంతో పాటు అనేక రకాల ప్రీమియం ఫీచర్స్‌తో రాబోతోంది. అయితే ఇటీవలే ఈ మొబైల్‌కి సంబంధించిన డిజైన్‌ కూడా లీక్‌ అయింది. ఈ లీక్‌ డిజైన్‌ ఎలా ఉందో దానికి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ Vivo T3 5G స్మార్ట్‌ఫోన్‌ LED ఫ్లాష్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా దీని బ్యాక్‌ సెటప్‌లో రింగ్‌ కెమెరాలతో అందుబాటులోకి వస్తోంది. దీంతో పాటు ఈ కెమోరాల్లో ఒకటి ఫ్లికర్ సెన్సార్‌తో లభిస్తోంది. ఈ మొబైల్‌ ఫ్లాట్ ఎడ్జ్‌లతో కుడివైపు పవర్‌ బటన్‌, వాల్యూమ్‌ కంట్రోల్‌ బటన్స్‌తో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ఈ మొబైల్‌ ఎన్నో రకాల ప్రీమియం ఫీచర్స్‌ను కలిగి ఉంది. 

Vivo T3 5G స్పెసిఫికేషన్స్:
త్వరలోనే మార్కెట్‌లోకి లాంచ్‌ కాబోయే  Vivo T3 5G స్మార్ట్‌ఫోన్‌ 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేతో రాబోతోంది. అలాగే దీని స్క్రీన్‌ HD+ రిజల్యూషన్‌తో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. అలాగే ఈ మొబైల్‌ డిప్ల్పే గరిష్టంగా 1800 నిట్‌ల వరకు బ్రైట్‌నెస్‌ వరకు సపోర్ట్‌ చేస్తుంది. ఈ మొబైల్‌ ఇన్-స్క్రీన్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా కలిగి ఉంటుందని లీక్ అయిన వివరాల్లో పేర్కొన్నారు. దీంతో పాటు శక్తివంతమైన డైమెన్సిటీ 7200 చిప్‌సెట్‌ను కలిగి ఉంటుంది. 

అంతేకాకుండా Vivo T3 5G స్మార్ట్‌ఫోన్‌ మొత్తం రెండు స్టోరేజ్‌ వేరియంట్స్‌లో అందుబాటులోకి రానుంది. ఇందులో మొదటిది 8 GB ర్యామ్‌, 128 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌, రెండవది 8 GB ర్యామ్‌, 256 GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌తో రాబోతోంది. అలాగే ఇది  5,000mAh బ్యాటరీతో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు  44W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌, డ్యూయల్ స్పీకర్స్‌ సిస్టమ్స్‌ను కలిగి ఉంటుందని పలువురు టిప్‌స్టర్స్‌ లీక్ చేశారు.  

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

ఇక ఈ మొబైల్‌ ఫ్రాంట్‌ లుక్‌ విషయానికొస్తే, Vivo T3 మొబైల్‌ 16-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది ప్రీమియం డిప్ల్పేను కలిగి ఉంటుంది. కెమెరా ఫీచర్స్‌కి వెళితే, దీని బ్యాక్‌ ప్యానెల్‌లో OIS సపోర్ట్‌తో 50-మెగాపిక్సెల్ సోనీ IMX882 ప్రధాన కెమెరాతో లభిస్తోంది. దీంతో పాటు అదనంగా 2-మెగాపిక్సెల్ బోకె లెన్స్‌ను కలిగి ఉండబోతున్నట్లు తెలుస్తోంది. దీని ధర దాదాపు రూ.20,000 ఉండే ఛాన్స్‌ ఉన్నట్లు టిప్‌స్టర్స్‌ తెలిపారు. ఈ మొబైల్‌ మార్కెట్‌లోకి లాంచ్‌ అయితే రెండు కలర్‌ ఆప్షన్స్‌లో క్రిస్టల్ ఫ్లేక్, కాస్మిక్ బ్లూ రెండు షేడ్స్‌లో రానుంది.

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News