Twitter Users Facing Problems: ట్విట్టర్ సర్వర్ డౌన్ అయింది. తమ ట్విట్టర్ ఖాతాలను ఓపెన్ చేయడంలో సమస్యలను ఎదుర్కొంటున్నట్లు వినియోగదారులు పోస్టులు పెడుతున్నారు. 'ఏదో తప్పు జరిగింది.. కానీ చింతించకండి -మరొకసారి ప్రయత్నించండి' అనే సందేశంతో ట్విట్టర్ పేజీ ఖాళీగా చూపిస్తోంది. ఇది కేవలం వెబ్ వినియోగదారులకు మాత్రమే చూపిస్తోంది. మొబైల్‌లో ట్విట్టర్ యాప్ పనిచేస్తోంది. కానీ వెబ్‌లో మాత్రం సర్వర్ డౌన్ అయింది. అయితే కాసేటికే సమస్యను పరిష్కరిండంతో మళ్లీ వెబ్‌లో కూడా ట్విట్టర్ అందుబాటులోకి వచ్చింది. ట్విట్టర్ సర్వర్ డౌన్‌కు కారణాలు తెలియాల్సి ఉంది.
ఇక ఇటీవలె వాట్సాప్ సేవలు నిలిచిపోవడంతో వినియోగదారులు తీవ్ర ఇబ్బంది పడిన విషయం తెలిసిందే. ప్రపంచ వ్యాప్తంగా దాదాపు గంటన్నర పాటు వాట్సాప్ సేవలు బంద్ అయ్యాయి. సర్వర్ డౌన్ కారణంగా సేవలు నిలిచిపోయాయి. మెటా స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించింది. తాజాగా ట్విట్టర్ వెబ్ బ్రౌజింగ్‌లో సమస్యలు రావడంతో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.
ట్విట్టర్ యాజమాన్యం చేతులు మారడంతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఫీచర్లు అందుబాటులోకి రావడంతో పాటు వివాదాలు చుట్టు ముడుతున్నాయి. బ్లూ టిక్ కోసం ఇక నుంచి ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాలని ఎలన్ మస్క్ చేసిన ప్రకటనపై విమర్శలు వస్తున్నాయి. బ్లూటిక్ కోసం నెలకు 8 డాలర్లు చెల్లించాల్సిందేనని ఆయన స్పష్టం చేశారు. అంతేకాకుండా నిబంధనలు కూడా గతంలో కంటే కాస్త కఠినంగా మార్చేసింది.
ఎలోన్ మస్క్ చేతికి ట్విట్టర్ వచ్చిన వారంలోనే ఎన్నో మార్పులు జరిగాయి. ఇప్పటికే టాప్ ఎగ్జిక్యూటివ్‌లను ఆయన తొలగించారు. అంతేకాకుండా పలువురు ఉద్యోగుల వర్కింగ్ అవర్స్‌ను ఏకంగా 12 గంటలు చేశారు. నవంబరు నాటికి ట్విట్టర్ వర్క్‌ఫోర్స్‌లో సగం మందిని తొలగించాలని యోచిస్తున్నట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి.
Also Read: Today Gold Rate: పసిడి ప్రియులకు గుడ్ న్యూస్... భారీగా పడిపోయిన బంగారం ధర..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3P3R74U
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook