Calling Smartwatch Under 2K: 2 వేల కంటే తక్కవ ధరలోనే యాపిల్ స్మార్ట్ వాచ్ ఫీచర్లు కలిగిన ఈ వాచ్‌ ధరేంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Bluetooth Calling Smartwatch Under Rs 2000: ఇండియా మార్కెట్లో చాలా రకాల స్మార్ట్ వాచ్లు అందుబాటులో ఉన్నాయి. అవి ఎక్కువ రేటు ఉన్నప్పటికీ తక్కువ ఫీచర్లతో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. అయితే తక్కువ ధరలోనే మీరు నచ్చే మెచ్చే వాచ్ ను ఈరోజు మేము పరిచయం చేయబోతున్నాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 8, 2022, 11:20 AM IST
Calling Smartwatch Under 2K: 2 వేల కంటే తక్కవ ధరలోనే యాపిల్ స్మార్ట్ వాచ్ ఫీచర్లు కలిగిన ఈ వాచ్‌ ధరేంతో తెలిస్తే ఆశ్చర్యపోతారు..

Bluetooth Calling Smartwatch Under Rs 2000: ప్రముఖ స్మార్ట్ వాచ్ తయారీ కంపెనీ పెబుల్ తమ మరో వాచ్ ని అతి తక్కువ ధరకే భారత మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ వాచ్ చూడడానికి యాపిల్ వాచ్ ఆకారంలో కలిగి ఉండి.. అలాంటి ఫీచర్స్ తోని మార్కెట్లో లభ్యమవుతోంది. పెబుల్ కంపెనీకి చెందిన ఈ వాచ్ కి సంస్థ ఫ్రాస్ట్ స్మార్ట్‌వాచ్ గా నామకరణం చేసింది. ఇది అత్యధిక టెక్నాలజీతో ఉండడమే కాకుండా వినియోదారులకు నచ్చే మెచ్చే చాలా రకాల ఫ్యూచర్లను ఇందులో పొందుపరిచారు. అయితే ఈ స్మార్ట్ వాచ్ కు సంబంధించిన మరిన్ని వివరాలు మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

బ్లూటూత్ కాలింగ్:
చాలామంది ప్రస్తుతం తక్కువ ధరలోని ఎక్కువ ఫీచర్లు కలిగిన స్మార్ట్ వాచ్లను కొనుగోలు చేస్తున్నారు. ముఖ్యంగా వాటిని కొనే క్రమంలో మొదటగా చెక్ చేసేది బ్లూటూత్ కాలింగ్ ఉందా లేదా అనేది..! మనం లాంగ్ డ్రైవ్ చేసే క్రమంలో చాలామంది బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్ ని తమ స్మార్ట్ వాచ్ లో వినియోగిస్తారు. కాబట్టి ప్రతి ఒక్కరు వారు కొనుగోలు చేసే వాచ్ లో బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్ ఉందా లేదా అని ఒకటికి పది సార్లు చెక్ చేస్తున్నారు. అయితే పెబుల్ కంపెనీకి చెందిన వాచ్ లో కూడా ఈ ఆప్షన్ ఉంది.

వాచ్ యొక్క ఇతర వివరాలు:
ఇది చూడడానికి యాపిల్ వాచ్ ను పోలి ఉంటుంది. 1.87-అంగుళాల LCD స్క్రీన్ అందుబాటులో ఉంది. అంతేకాకుండా 2D కర్వ్డ్ ప్యానెల్ కూడా  దీనికి అమర్చారు. ఇది అత్యాధునిక టెక్నాలజీ పై పనిచేస్తుంది. 

ప్రస్తుతం భారతదేశంలో పెబుల్ ఫ్రాస్ట్ స్మార్ట్‌వాచ్ రూ. 1,999లకే మార్కెట్లో అందుబాటులో ఉంది. దీనిని మీరు ఫ్లిప్కార్ట్ లో కొనుగోలు చేస్తే బ్యాంక్ ఆఫర్స్ పై తక్కువ ధరకే మీకు లభిస్తుంది. ప్రస్తుతం ఇది ఈ కామర్స్ వెబ్సైట్లలో ధర పరంగా ఈ వాచ్ boAt, Noise, Fire Bolt స్మార్ట్‌వాచ్‌లతో పోటీపడుతుంది.

పెబుల్ ఫ్రాస్ట్ స్మార్ట్‌వాచ్ స్పెసిఫికేషన్‌లు:
వాచ్ అనేక అంతర్నిర్మిత ఫిట్‌నెస్, హెల్త్ ట్రాకింగ్ ఫీచర్‌లతో వస్తుంది. హార్ట్ రేట్, బ్లడ్ ఆక్సిజన్, స్టెప్స్, స్లీప్ ట్రాకింగ్ వంటివి వాచ్‌లో అందుబాటులో ఉన్నాయి. వాచ్‌కి IP67 రేటింగ్ వాటర్ రెసిస్టెంట్ కూడా అందుబాటులో ఉంటుంది. ఈ వాచ్ తో మీ మొబైల్ కెమెరా, మ్యూజిక్ ని కూడా నియంత్రణలోకి తీసుకురావచ్చు.

Also Read: Rohit Sharma: రోహిత్‌ భయ్యా.. నీకు కుట్లు పడిన విషయం గుర్తుందా! నువ్ 'మగధీర'లో హీరో

Also Read: Delhi MCD Election Result: ఢిల్లీ కార్పొరేషన్ పీఠం ఆప్ కైవసం.. బీజేపీ చేసిన తప్పులు ఇవే..  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

Twitter,  Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి 

Trending News