స్మార్ట్‌ఫోన్లలో కూడా ఇప్పుడు ఫీచర్లు అదిరిపోతున్నాయి. ముఖ్యంగా కెమేరా విషయంలో దిమ్మతిరిగే టెక్నాలజీ, ఫీచర్లు వస్తున్నాయి. కెమేరా మెగాపిక్సెల్ చూస్తే..డీఎస్ఎల్ఆర్ స్టిల్ కెమేరా గుర్తుకు రావల్సిందే.
శాంసంగ్ అతి త్వరలో 200 మెగాపిక్సెల్ కెమేరాతో స్మార్ట్‌ఫోన్ త్వరలో లాంచ్ చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ డిజైన్, ఫీచర్లు బహిర్గతమయ్యాయి. Galaxy S23 Ultraలో ఈ అత్యద్భుత ఫీచర్లు కలిగి ఉన్నాయి. శాంసంగ్ కంపెనీ త్వరలో లేటెస్ట్ జనరేషన్ ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ లాంచ్ చేయనుంది. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ఈ స్మార్ట్‌ఫోన్ అధికారిక ప్రకటనకు ముందే.. ఫీచర్లు వెలుగుచూస్తున్నాయి. Galaxy S23 Ultraలో ఫీచర్లు చూస్తే మతి పోవల్సిందే.
Galaxy S23 Ultraలో 200 మెగాపిక్సెల్ కెమేరా
అసలు శాంసంగ్ తీసుకొస్తున్న ఈ స్మార్ట్‌ఫోన్‌లో కెమేరా మెగాపిక్సెల్ చూస్తే ఔరా అని నోరెళ్లబెట్టాల్సిందే. ఇందులో రెండు ఆప్షన్లతో ఈ ఫోన్ వస్తోంది. ఒకటి 200 మెగాపిక్సెల్ కాగా రెండవది 50 మెగాపిక్సెల్ స్మార్ట్‌ఫోన్.
Galaxy S23 Ultra కెమేరా వివరాలు
ముందుగా గెలాక్సీ ఎస్ 23 అల్ట్రాలో 200 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. రెండోవైపు ఈ కెమేరా 50 మెగాపిక్సెల్ షూటింగ్ మోడ్ కోసం ఉంటుంది. ఇందులో నాలుగు పిక్సెల్స్ ఒకేదాంట్లో ఉంటాయి. గెలాక్సీ ఎస్ 23 అల్ట్రాకు 200 మెగాపిక్సెల్ సెన్సార్‌తో పాటు 1/1.3 ఇంచెస్ సెన్సార్‌పై 0.6μm పిక్సెల్ సైజ్ ఉంటుంది. ఇందులో ఎఫ్ 1.7 ఎపెర్చర్ కలిగి ఉంటుంది.
శాంసంగ్ త్వరలో లాంచ్ చేయనున్న గెలాక్సీ ఎస్ 23 అల్ట్రా మోడల్‌లో కొత్త 200 మెగాపిక్సెల్ ISOCELL HPX సెన్సార్ ఉపయోగిస్తుంది. ఇందులో కొత్త టెక్నాలజీ ఉంటుంది. ఇందులో 4 లేదా 16 మెగాపిక్సెల్‌ను ఒకేసారి కలిపి వినియోగించేందుకు వీలుంటుంది.
Also read: Amazon Smart tv offers: మీ ఇంటిని హోమ్ థియేటర్‌గా మార్చే స్మార్ట్‌టీవీ కేవలం 9 వేలకే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook