Samsung Galaxy S24 FE Price: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ సాంసంగ్ తమ కస్టమర్స్‌కి గుడ్ న్యూస్ తెలిపింది. త్వరలోనే లాంచ్ చేయబోయే Samsung Galaxy S24 FE మొబైల్ సంబంధించిన పెద్ద అప్‌డేట్ వచ్చింది. సాంసంగ్ కంపెనీ 'FE' ఫ్యాన్ ఎడిషన్‌ను శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ఇది ప్రీమియం లుక్‌తో పాటు అద్భుతమైన డిజైన్‌తో మార్కెట్‌లోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ Samsung Galaxy S23 FE మొబైల్‌కి సక్సెసర్‌గా అందుబాటులోకి రాబోతున్నట్లు కంపెనీ తెలిపింది. అయితే ఈ మొబైల్‌కు సంబంధించిన ప్రత్యేకమైన అప్‌డేట్ వచ్చింది. అయితు ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
Samsung Galaxy S24 FE లాంచింగ్ తేదీ:
ఇటీవలే సాంసంగ్ Galaxy S24 FE స్మార్ట్‌ఫోన్ సంబంధించిన లాంచింగ్ వార్తలు కూడా వస్తున్నాయి. అయితే కంపెనీ ఈ స్మార్ట్‌ఫోన్‌ను సాంసంగ్ అన్‌ప్యాక్డ్ ఈవెంట్‌లో భాగంగా జూలైలో లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనిని సాంసంగ్ వివిధ రకాల వేరియంట్స్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు ఇదే ఈవేంట్‌లో భాగంగా అనేక రకాల కొత్త పరికరాలు లాంచ్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది.
Samsung Galaxy S24 FE స్పెసిఫికేషన్‌లు:
Samsung S24 FE స్మార్ట్‌ఫోన్ అనేక రకాల కొత్త ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఈ మొబైల్ ఎంతో పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 చిప్‌సెట్‌లో అందుబాటులోకి రానుంది. దీంతో పాటు ఇందులో Exynos 2400 చిప్‌సెట్ కూడా ఉండే అవకాశాలు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. అలాగే ఈ మొబైల్ 12GB LPDDR5X ర్యామ్‌తో 256GB UFS 4.0 ఇంటర్నల్ స్టోరేజ్‌తో మార్కెట్‌లోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. లీక్ అయిన వివరాల ప్రకారం, ఇది 6.1 అంగుళాల AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఈ స్మార్ట్‌ఫోన్ 4,500mAh బ్యాటరీతో రాబోతోంది.
Samsung Galaxy S23 FE ధర:
సాంసంగ్ Galaxy S23 FE స్మార్ట్‌ఫోన్ మొత్తం రెండు వేరియంట్స్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. దీంతో పాటు రెండు మెమరీ వేరియంట్‌లలో విడుదల చేయబడింది. ఇందులో బేస్ మోడల్ 8GB ర్యామ్‌తో పాటు 128GB ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్‌లో అందుబాటులోకి రాబోతోంది. దీనిని కంపెనీ ధర రూ. 54,999తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు రెండవ వేరియంట్ 8GB ర్యామ్‌తో పాటు 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి రాబోతోంది. ఇది రూ. 59,999కే లభిస్తోంది. దీనిని కంపెనీ గ్రాఫైట్, పర్పుల్ కలర్స్‌తో తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.
Samsung Galaxy S23 FE స్పెసిఫికేషన్‌లు:
50MP + 12MP + 8MP కెమెరా
10MP సెల్ఫీ కెమెరా
6.4 అంగుళాల 120Hz డైనమిక్ AMOLED 2x డిస్ప్లే
Samsung Exynos 2200
4,500mAh బ్యాటరీ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి