Samsung Galaxy S23 Price Cut 2023: బంపర్ ఆఫర్ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్.. 37 వేలకే శాంసంగ్‌ గెలాక్సీ ఎస్23!

Purchage Samsung Galaxy S23 5G SmartPhone Jus Rs 37 Thousand in Flipkart.'ఫ్లిప్‌కార్ట్'లో శాంసంగ్ గెలాక్సీ ఎస్23 స్మార్ట్‌ఫోన్‌ను రూ. 36999కి కొనుగోలు చేయవచ్చు.   

Written by - P Sampath Kumar | Last Updated : Mar 23, 2023, 06:00 PM IST
  • బంపర్ ఆఫర్ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్
  • 37 వేలకే శాంసంగ్‌ గెలాక్సీ ఎస్23
  • ఎగబడుతున్న జనాలు
Samsung Galaxy S23 Price Cut 2023: బంపర్ ఆఫర్ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్.. 37 వేలకే శాంసంగ్‌ గెలాక్సీ ఎస్23!

Buy Samsung Galaxy S23 5G SmartPhone Only Rs 36999 in Flipkart: సౌత్ కొరియాకు చెందిన 'శాంసంగ్' మొబైల్ సంస్థ భారత మార్కెట్‌లో ఎప్పటికప్పుడు కొత్త స్మార్ట్‌ఫోన్‌లను విడుదల చేస్తూ కస్టమర్లను ఆకట్టుకుంటోంది. శాంసంగ్ కంపెనీ గెలాక్సీ 23 (Samsung Galaxy 23) సిరీస్‌ని ఫిబ్రవరిలో రిలీజ్ చేసింది. ఈ సిరీస్ గొప్ప డిజైన్‌ కారణంగా సక్సెస్ అయింది. ఈ సిరీస్ డిజైన్ మరియు ఫీచర్లకు కస్టమర్లు ఫిదా అయ్యారు. శాంసంగ్ గెలాక్సీ ఎస్23 (Samsung Galaxy S23) స్మార్ట్‌ఫోన్‌ ప్రారంభ ధర రూ. 74999లుగా ఉంది. అయితే 'ఫ్లిప్‌కార్ట్'లో ఈ స్మార్ట్‌ఫోన్‌ను సగం ధరకే కొనుగోలు చేయవచ్చు. 

Galaxy S23 Price:
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 ధర (Galaxy S23 8 GB RAM + 256 GB స్టోరేజ్) రూ. 95999లుగా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఫ్లిప్‌కార్ట్‌లో 16% తగ్గింపు ఉంది. దాంతో రూ. 79999కి అందుబాటులో ఉంది. గెలాక్సీ ఎస్23ని ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేస్తే.. మీరు రూ. 16000 ఆదా చేసుకోవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్‌పై బ్యాంక్ మరియు ఎక్స్‌ఛేంజ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. 

Galaxy S23 Bank Offers:
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 స్మార్ట్‌ఫోన్‌ను ఫ్లిప్‌కార్ట్ ద్వారా కొనుగోలు చేస్తే.. రూ. 3000 తగ్గింపు లభిస్తుంది. రూ. 5000 షాపింగ్ చేసే వారి కోసం ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇది కాకుండా హెచ్‌డీఎఫ్‌సీ క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లింపు చేస్తే.. 5 వేల రూపాయల తగ్గింపు ఉంటుంది. మీకు మొత్తంగా రూ. 8000 తగ్గింపు లభిస్తుంది. 

Galaxy S23 Exchange Offer:
శాంసంగ్ గెలాక్సీ ఎస్23 స్మార్ట్‌ఫోన్‌పై 35 వేల రూపాయల ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ ఉంది. మీరు మీ పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే..  ఈ మొత్తం లభిస్తుంది. మీ పాత ఫోన్ కండీషన్‌ బాగుండి.. లేటెస్ట్‌ మోడల్ అయి ఉండి.. ఎలాంటి డామేజ్ లేకుంటేనే 35 వేల ఎక్స్‌ఛేంజ్ మొత్తం వర్తిస్తుంది. పూర్తి ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ వర్తిస్తే శాంసంగ్ గెలాక్సీ ఎస్23 రూ. 36999కి మీకు లభిస్తుంది. అంటే సగం ధరకే శాంసంగ్‌ గెలాక్సీ ఎస్23ని ఇంటికితీసుకెళ్లిపోవచ్చు. 

Also Read: Oppo Find N2 Flip: ఒప్పో ఫైండ్ ఎన్2 ఫ్లిప్‌ క్రేజ్ మాములుగా లేదుగా.. నిమిషంలో స్టాక్ మొత్తం కలాస్!  

Also Read: Brave Lady Traps Cobra: కాటు వేయటానికి వచ్చిన కింగ్ కోబ్రాను ఈజీగా కంట్రోల్ చేసిన అమ్మాయి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News