Jio Fiber Plans: కాంతివేగంతో పనిచేసే ఫాస్ట్ ఇంటర్నెట్ కోసం ఎదురు చూస్తుంటే జియో అందిస్తోంది సరికొత్త బ్రాడ్‌బ్యాండ్ కనెక్షన్ ప్లాన్ అందుబాటులో ఉంది. జియో ఫైబర్ వార్షిక ప్లాన్స్ ఇతర ప్రయోజనాలు చాలావరకూ పొందవచ్చు. జియో ఫైబర్ కొత్త ప్లాన్ లాభాలేంటో తెలుసుకుందాం.
జియో ఫైబర్ అందిస్తున్న ఈ ప్లాన్‌లో 150 ఎంబీపీఎస్ వరకూ స్పీడ్ ఇంటర్నెట్‌తో పాటు సోనీలివ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, ప్రైమ్ వీడియో వంటి ఓటీటీ సేవలు ఉచితంగా లభించనున్నాయి. జియో ఫైబర్ అందిస్తున్న 899, 799, 999 రూపాయల నెలవారీ ప్లాన్స్ గురించి వివరంగా ఓసారి పరిశీలిద్దాం.
జియో 899 ప్లాన్
ఈ ప్లాన్‌లో 100 ఎంబీపీఎస్ స్పీడ్, అన్‌లిమిటెడ్ డేటా లభిస్తుంది. ఇందులో వార్షిక ప్లాన్ తీసుకుంటే 10,788 రూపాయలకు జీఎస్టీ అదనంగా లభిస్తుంది. అదనంగా నెల రోజుల ప్రయోజనం ఉంటుంది. దీంతోపాటు 550 టీవీ ఛానెళ్లు ఉచితంగా పొందవచ్చు. ఇదంతా ఓ ఎత్తైతే అమితమైన ఓటీటీ సేవలు పొందవచ్చు. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, సోనీలివ్, జీ5, వూట్ సెలెక్ట్, జియో సినిమా సబ్‌స్క్రిప్షన్స్ ఉచితంగా లభిస్తాయి.
జియో ఫైబర్ 799 ప్లాన్
ఇందులో కూడా 100 ఎంబీపీఎస్ స్పీడ్ అన్‌లిమిటెడ్ డేటా ఉంటుంది. ఇదే ప్లాన్ ఏడాదికి తీసుకుంటే 9,588 రూపాయలు జీఎస్టీ అదనంగా ఉంటుంది. నెల రోజులు అదనపు వ్యాలిడిటీ పొందవచ్చు. మరోవైపు 400 టీవీ ఛానెళ్లు ఉచితంగా అందుతాయి. ఇక యూనివర్శల్ ప్లస్, ఆల్ట్ బాలాజీ, ఎరోస్ నౌ, జియో సినిమా ఓటీటీలు ఉచితంగా లభిస్తాయి.
జియా ఫైబర్ 999 ప్లాన్
జియో ఫైబర్ 999 ప్లాన్‌లో 150 ఎంబీపీఎస్ స్పీడ్ ఇంటర్నెట్, అన్‌లిమిటెడ్ డేటా ఉంటుంది. ఇందులో వార్షిక ప్లాన్ తీసుకుంటే 11,988 రూపాయులకు జీఎస్టీ అదనంగా చెల్లించాలి. అదనపు వ్యాలిడిటీతో పాటు 550 టీవీ ఛానెళ్లు పొందవచ్చు. ఇక ఉచితి ఓటీటీల గురించి పరిశీలిస్తే..అమెజాన్ ప్రైమ్, డిస్నీ ప్లస్ హాట్‌స్టార్, వూట్ సెలెక్ట్ లభిస్తాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook