Redmi 12 Price: ప్రస్తుతం మిడిల్ క్లాస్ స్మార్ట్ ఫోన్ యూజర్స్ అంతా అతి తక్కువ ధరలోనే ఎక్కువ ఫీచర్లు కలిగిన స్మార్ట్ ఫోన్స్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా చాలామంది తక్కువ బడ్జెట్లో వచ్చే స్మార్ట్ ఫోన్స్‌నే ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. ఇక యువత విషయానికి వస్తే ఎక్కువ ఇంటర్నల్ స్టోరేజ్, హై ఎండ్ ప్రాసెస్ కలిగిన మొబైల్స్‌ను కొనేందుకు తెగ ఇష్టపడుతున్నారు. ఇక స్మార్ట్ ఫోన్ కంపెనీలు కూడా వీరిని దృష్టిలో పెట్టుకొనే కొత్త మొబైల్స్‌ను తయారు చేస్తూ మార్కెట్లో అతి చవక ధరల్లో విక్రయిస్తున్నాయి. ముఖ్యంగా పోకో, రెడ్‌మీ, రియల్ మీ లాంటి చైనా స్మార్ట్ ఫోన్ కంపెనీలు ఎక్కువగా ప్రీమియం ఫీచర్స్‌తో అతి తక్కువ ధరలు మొబైల్స్ అందిస్తున్నాయి. అయితే మీరు కూడా ఎప్పటినుంచో మంచి అద్భుతమైన కెమెరా, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ కలిగిన స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా?
గతంలో రెడ్‌మీ(Redmi) విడుదల చేసిన 12 సిరీస్ మోడల్‌కి మంచి గుర్తింపు లభించింది. దీంతో కంపెనీ వీటివిక్రయాలను జోరుగా పెంచేసింది. అలాగే ఈ కంపెనీ 12 మోడల్ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేసే వారికి కూడా ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ అందిస్తోంది. ముఖ్యంగా ఈ మొబైల్‌ను ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో కొనుగోలు చేసే వారికి అద్భుతమైన డిస్కౌంట్ ఆఫర్స్ లభిస్తున్నాయి. ప్రస్తుతం అమెజాన్‌లో ఈ స్మార్ట్ ఫోన్ మూడు కలర్ ఆప్షన్స్‌తో పాటు, మూడు స్టోరేజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. ప్రస్తుతం 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన మొబైల్ కేవలం రూ.19000 లోపే లభిస్తుంది.
అమెజాన్‌లో ఈ Redmi 12 స్మార్ట్ ఫోన్ ఇప్పుడే కొనుగోలు చేసే వారి అద్భుతమైన ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ లభిస్తాయి. ఏకంగా ఈ మొబైల్ పై 30 శాతం వరకు డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో ఫ్లాట్ డిస్కౌంట్ ఆఫర్ పోను 13,999కే కొత్త స్మార్ట్ ఫోన్‌ను పొందవచ్చు. ఈ మొబైల్‌ను కొనుగోలు చేసే క్రమంలో ఐసిఐసిఐ బ్యాంక్, SBI బ్యాంకు క్రెడిట్ కార్డు ను వినియోగించి బిల్ చెల్లించే వారికి దాదాపు రూ.1,000 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతోపాటు అదనంగా ఇతర బ్యాంకులకు సంబంధించిన ఆఫర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. వీటిని వినియోగించి కొనుగోలు చేస్తే మరింత తగ్గింపు పొందే ఛాన్స్ ఉంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్‌పై అమెజాన్ ఆకర్షణీయమైన EMI ఆప్షన్స్ కూడా అందిస్తోంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఈ Redmi 12 స్మార్ట్ ఫోన్‌పై అమెజాన్ ఎక్స్చేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ను వినియోగించి కొనుగోలు చేసే వారికి అద్భుతమైన ఎక్స్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. ఈ ఆఫర్‌ను పొందడానికి ముందుగా పాత స్మార్ట్ ఫోన్‌ను ఎక్స్చేంజ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.13 వేల వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతో డిస్కౌంట్ ఆఫర్స్ పోను రూ. 999కే కొత్త మొబైల్‌ను పొందవచ్చు. అయితే ఈ ఎక్స్చేంజ్ బోనస్ అనేది మీరు ఎక్స్చేంజ్ చేసే పాత స్మార్ట్ ఫోన్ కండిషన్ పై ఆధారపడి ఉంటుంది. మొబైల్ కండిషన్ బాగుంటేనే మంచి బోనస్ లభిస్తుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి