Redmi 12 5G Price: అమెజాన్‌లో రూ.699కే Redmi 12 5G మొబైల్‌.. ఎలా కొనుగోలు చేయాలో తెలుసా?

Redmi 12 5G Price Dropped: అమెజాన్‌లో Redmi 12 5G స్మార్ట్‌ఫోన్‌పై అద్భుమైన డిస్కౌంట్ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడే కొనుగోలు చేసేవారికి రూ.1 వేయి ప్రత్యేకమైన కూపన్‌ కూడా లభిస్తోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌ ఇప్పుడు తెలుసుకోండి. 

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jul 1, 2024, 03:06 PM IST
Redmi 12 5G Price: అమెజాన్‌లో రూ.699కే Redmi 12 5G మొబైల్‌.. ఎలా కొనుగోలు చేయాలో తెలుసా?

Redmi 12 5G Price Dropped: అతి తక్కువ ధరలోనే 6GB ర్యామ్‌, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగని స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? ఇది సరైన సమయంగా భావించవచ్చు. ప్రముఖ ఈ కామర్స్‌ కంపెనీ అమెజాన్‌లో చైనీస్‌ బ్రాండ్‌లకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ తగ్గింపు లభిస్తోంది. ముఖ్యంగా కొన్ని మొబైల్స్‌పై దాదాపు 50 శాతం వరకు కూడా తగ్గింపు లభిస్తోంది. ఎక్కువ స్టోరేజ్‌ కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే ఇదే సరైన సమయంగా భావించవచ్చు. అమెజాన్‌లో 128GB స్టోరేజ్‌ కలిగిన Redmi 12 5G స్మార్ట్‌ఫోన్‌ భారీ తగ్గింపుతో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా లభిస్తున్నాయి. అయితే ఈ మొబైల్‌పై ఏయే బ్యాంక్‌ ఆఫర్స్‌ అందుబాటులో ఉన్నాయో? దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రస్తుతం అమెజాన్‌లో Redmi 12 5G స్మార్ట్‌ఫోన్‌ మూడు స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. ఇది 4GB RAM + 128GB స్టోరేజ్‌, 6GB RAM + 128GB స్టోరేజ్‌, 8GB RAM + 256GB స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. ప్రస్తుతం మిడిల్‌ రేంజ్‌ స్టోరేజ్‌ వేరియంట్‌ కలిగిన ఈ స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.17,999తో అందుబాటులో ఉంది. అయితే ఇప్పుడే అమెజాన్‌లో కొనుగోలు చేస్తే 30 శాతం తగ్గింపుతో కేవలం రూ. 12,499కే పొందవచ్చు. దీంతో పాటు అదనంగా రూ. 1,000 వరకు ప్రత్యేకమైన కూపన్‌ను కూడా పొందవచ్చు. దీంతో అన్ని డిస్కౌంట్‌ ఆఫర్స్‌ పోను రూ. 11,499కే లభిస్తుంది. అంతేకాకుండా అమెజాన్‌ నో కాస్ట్‌ EMI ఆప్షన్‌ను కూడా అందిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేసేవారు నెలకి రూ.697 చెల్లించాల్సి ఉంటుంది.

అలాగే ఈ స్మార్ట్‌ఫోన్‌పై అమెజాన్‌ అద్భుతమైన ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే భారీ డిస్కౌంట్‌తో ఈ మొబైల్‌ను పొందవచ్చు. అయితే ఈ ఆఫర్‌ను వినియోగించాలనుకునేవారు ముందుగా పాత మొబైల్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా చేస్తే దాదాపు రూ.11,800 ఎక్చేంజ్ బోనస్‌ లభించే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ బోనస్‌ అనేది మీరు ఎక్చేంజ్‌ చేసే పాత స్మార్ట్‌ఫోన్‌ కండీష్‌పై అధారపడి ఉంటుంది. కండీషన్‌ బాగుంటేనే ఎక్చేంజ్‌ బోనస్‌ లభిస్తుంది. లేకపోతే బోనస్‌లో మార్పులు వచ్చే ఛాన్స్‌ కూడా ఉంది. ఇక ఈ ఎక్చేంజ్‌ ఆఫర్‌ పోను కేవలం రూ.699కే పొందవచ్చు. 

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

రెడ్‌మీ 12 స్మార్ట్‌ఫోన్‌ టాప్ ఫీచర్స్‌:
5G కనెక్టివిటీ
Qualcomm Snapdragon 4 Gen 2 ప్రాసెసర్‌
5000mAh బ్యాటరీ
6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లే 
90Hz రిఫ్రెష్ రేట్‌
ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్
50MP ప్రధాన కెమెరా
8MP అల్ట్రావైడ్ కెమెరా
2MP మాక్రో కెమెరా
13MP ఫ్రంట్ కెమెరా
256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌
33W ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్‌
స్టైలిష్ డిజైన్

Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ ఇవే!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News