Realme GT 6T: 12జీబీ ర్యామ్ 512జీబీ స్టోరేజ్2తో శక్తివంతమైన గేమింగ్ ఫోన్ వచ్చేసింది, ధర ఎంతంటే

Realme GT 6T: సూపర్ డూపర్ ఫీచర్లతో అత్యంత శక్తివంతమైన గేమింగ్ ఫోన్ వచ్చేసింది. ఇటీవలే భారతీయ మార్కెట్‌లో లాంచ్ అయింది. ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం Realme GT 6T విక్రయాలు కూడా ప్రారంభమయ్యాయి. ఈ ఫోన్ ధర, ఫీచర్లు ఇతర వివరాలు ఓసారి తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : May 29, 2024, 11:56 AM IST
Realme GT 6T: 12జీబీ ర్యామ్ 512జీబీ స్టోరేజ్2తో శక్తివంతమైన గేమింగ్ ఫోన్ వచ్చేసింది, ధర ఎంతంటే

Realme GT 6T: భారతీయ స్మార్ట్ మార్కెట్‌లో రియల్‌మి సంచలనం రేపింది. అత్యంత శక్తివంతమైన గేమింగ్ ఫోన్ విక్రయాల్లో రికార్డు సృష్టించింది. కేవలం రెండు గంటల్లోనే ఎర్లీ బర్డ్ సేల్ పూర్తయిపోయింది. రియల్ మి నుంచి కొత్తగా లాంచ్ అయిన  Realme GT 6T అమ్మకాలు మొన్నటి నుంచి అమెజాన్‌తో పాటు రియల్‌మి వెబ్‌సైట్ , స్టోర్స్‌లో మొదలయ్యాయి. 

Realme GT 6T ఫోన్ 6.78 ఇంచెస్ 8T LTPO OLED డిస్‌ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ కలిగి ఉంటుంది.  అన్నింటికంటే ముఖ్యంగా 3డి కర్వ్డ్ స్క్రీన్ ఉంది. హై గ్రేడ్ స్టెయిన్‌లెస్ స్టీల్ మాడ్యూల్, మిస్టీ ఏజీ ప్రోసెస్‌తో ఉంటుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 ప్లస్ జనరేషన్ ప్రోసెసర్ కలిగి ఉంటుంది. ఇక మరోవైపు 120 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేయడమే కాకుండా 5500 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. 

Realme GT 6Tలో 8 జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ సామర్ధ్యంతో పాటు 256 జీబీ స్టోరేజ్ కూడా ఉంటుంది. అంతేకాకుండా 12 జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్‌తో పాటు 512 జీబీ స్టోరేజ్ ఉంటుంది. మొత్తం నాలుగు వేరియంట్లలో ఈ ఫోన్ లభ్యమౌతోంది. అన్నింటిపై 4 వేల రూపాయలు బ్యాంక్ ఆఫర్, 2 వేల రూపాయలు ఎక్స్చేంజ్ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. దాంతోపాటు 6 నెలల వరకూ నో కాస్ట్ ఈఎంఐ వెసులుబాటు ఉంది. 

Realme GT 6T ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ సోనీ లిట్ 600 మెయిన్ కెమేరా ఉంటే 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమేరాతో పాటు సెల్ఫీ లేదా వీడియా కాలింగ్ కోసం 32 మెగాపిక్సెల్ కెమేరా ఉన్నాయి. 8జీబీ ర్యామ్-128 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర 30,999 రూపాయలు కాగా ఇందులోనే 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ అయితే 32,999 రూపాయలుంది. ఇక 12 జీబీ ర్యామ్-256 జీబీ స్టోరేజ్ ఫోన్ ధర 35,999 రూపాయలు కాగా ఇందులోనే 512 జీబీ స్టోరేజ్ వెర్షన్ అయితే 39,999 రూపాయలుంది. 

Also read: Income tax Alert: ఈ 5 లావాదేవీలతో జాగ్రత్త, ఇన్‌కంటాక్స్ నుంచి నోటీసులు రావచ్చు

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News