Realme Gt 5 Pro Price: శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Realme Gt 5 Pro మొబైల్‌..ఫీచర్స్‌, ధర వివరాలు ఇవే!

Realme Gt 5 Pro Price: రియల్‌ మీ నుంచి మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ ఫోన్‌ విడుదల కాబోతోంది. Realme GT 5 Pro పేరుతో ఈ స్మార్ట్ ఫోన్‌ లాచ్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 9, 2023, 03:59 PM IST
Realme Gt 5 Pro Price: శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Realme Gt 5 Pro మొబైల్‌..ఫీచర్స్‌, ధర వివరాలు ఇవే!

Realme Gt 5 Pro Price: ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ కంపెనీ Realme త్వరలో మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ ఫోన్‌ను విడుదల చేయబోతోంది. Realme ఇటీవలే విడుదల చేసిన GT మోడల్‌కి సక్సెసర్‌గా Realme GT 5 Proను లాంచ్‌ చేసేందుకు సిద్ధమైంది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ను టీజర్‌ ద్వారా వెల్లడించింది. ఈ మొబైల్‌ ఫోన్‌ కెమెరాలో బ్రైట్‌నెస్‌ టెలిఫోటో షాట్‌ ఫీచర్‌ను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ Realme GT 5 Pro స్మార్ట్‌ ఫోన్‌ 1TB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో మార్కెట్‌లోకి విడుదల కాబోతోంది. 

ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌ను కూడా కంపెనీ అధికారికంగా ప్రకటించింది. ఈ Realme GT 5 Pro స్మార్ట్‌ ఫోన్‌ డిస్‌ప్లే గరిష్టంగా  3,000 నిట్స్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఇది Qualcomm Snapdragon 8 Gen 3 SoC చిప్‌సెట్‌పై పని చేస్తుందని Weiboలో పేర్కొన్నారు. ఈ స్మార్ట్‌ ఫోన్‌ టెలిఫోటో కెమెరాతో పాటు 240W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఎక్కువ బ్యాటరీ లైఫ్‌ను అందించేందుకు ఈ స్మార్ట్ ఫోన్‌ అతి శక్తవంతమైన బ్యాటరీని కలిగి ఉంటుంది. సులభంగా చార్జింగ్‌ చేసుకోవడానికి ఫాస్ట్‌ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. 

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

Realme GT 5 Pro ధర:
ప్రముఖ టిప్‌స్టర్‌ తెలిపిన వివరాల ప్రకారం..మొదట ఈ Realme GT 5 Pro స్మార్ట్‌ ఫోన్‌ను కంపెనీ చైనాలో విడుదల చేయబోతోందని..12GB/256GB వేరియంట్‌ గల ఈ మొబైల్‌  CNY 2999 (సుమారు రూ. 34000)తో విడుదల చేయబోతోంది. 16GB/512GB వేరియంట్ ధర CNY 3299 (సుమారు రూ. 37,000), 1TB వేరియంట్ CNY 3699 (సుమారు రూ. 42000) ఉంటుందని టిప్‌స్టర్‌ తెలిపారు. భారత్‌లో ఈ స్మార్ట్‌ ఫోన్‌ విడుదలైతే ధరలో మార్పులు చేర్పులు జరిగే ఛాన్స్‌లు కూడా ఉన్నాయి.

Realme GT 5 Pro ఫీచర్లు:
6.78 అంగుళాల AMOLED డిస్‌ప్లే
1,264x2,780 పిక్సెల్స్‌
128GB, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌
50-మెగాపిక్సెల్ Sony LYTIA LYT808 కెమెరా
8-మెగాపిక్సెల్ Sony IMX890 టెలిఫోటో సెన్సార్‌ కెమెరా
32-మెగాపిక్సెల్ ఫ్రంట్‌ కెమెరా

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News