Realme C63 5G Price Cut: ప్రముఖ చైనీస్ కంపెనీ రియల్‌మీ తమ కొత్త బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసింది. దీనిని కంపెనీ Realme C63 పేరుతో అందుబాటులోకి తీసుకు వచ్చింది. దీని డిజైన్ ఐఫోన్ ప్రో వెర్షన్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఇది శక్తివంతమైన ఫీచర్స్‌తో కంపెనీ లాంచ్ చేసింది. అంతేకాకుండా కంపెనీ ఈ మొబైల్‌ను Unisoc T612 SoC ప్రాసెసర్‌ను కలిగి ఉంటుంది. అలాగే అతి తక్కువ ధరలోనే ఈ స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇప్పుడు తెలుసుకుందాం.
Realme C63 స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు:
ఈ Realme C63 స్మార్ట్‌ఫోన్ అనేక రకాల ప్రీమియం ఫీచర్స్‌తో అందుబాటులోకి వచ్చింది. ఇది ఫ్రంట్ సెటప్‌లో U- ఆకారపు నాచ్‌తో పాటు 8MP సెల్ఫీ కెమెరాలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఈ మొబైల్ అద్భుతమైన 6.74" HD+ డిస్ల్పేతో అందుబాటులోకి వచ్చింది. ఇది 560 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సెటప్‌తో లభిస్తోంది. అలాగే ఈ మొబైల్ AI డ్యూయల్-లైట్ సెన్సార్ సెటప్‌తో లభిస్తోంది. దీంతో పాటు మినీ క్యాప్సూల్, రెయిన్‌వాటర్ స్మార్ట్ టచ్ వంటి ప్రీమియం టెక్నాలజీ సెటప్‌లతో లభిస్తోంది. అలాగే ఎయిర్ గెస్చర్ ఫీచర్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇన్‌కమింగ్ కాల్‌లను మ్యూట్ చేయడానికి ప్రత్యేకమైన ఫీచర్‌ను కూడా అందిస్తోంది.
ఈ Realme C63 స్మార్ట్‌ఫోన్ ఎంతో శక్తివంతమైన Unisoc T612 SoC ప్రాసెర్‌తో Android 14తో అందుబాటులోకి వచ్చింది. ఇది 8GB ర్యామ్‌తో పాటు 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో లభిస్తోంది. అంతేకాకుండా దీని బ్యాక్ సెటప్‌లో 50MP ప్రధాన కెమెరాలను కలిగి ఉంటుంది. దీంతో పాటు లెదర్ బ్లూ, జేడ్ గ్రీన్ కలర్ ఆప్షన్స్‌ను కలిగి ఉంటుంది. ఇక ఈ మొబైల్‌కి సంబంధించిన బ్యాటరీ వివరాల్లోకి వెళితే, ఇది 5,000 mAh బ్యాటరీ, 45W ఛార్జింగ్ సపోర్ట్‌తో అందుబాటులోకి వచ్చింది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఈ Realme C63 స్మార్ట్‌ఫోన్ IP54 రేటింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు 360° NFC, డైనమిక్ బటన్, USB-C, 3.5 mm హెడ్‌ఫోన్ జాక్ వంటి అనేక రకాల ప్రీమియం ఫీచర్స్ ఈ మొబైల్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు అదనంగా మెమోరీని పెంచుకునేందుకు మైక్రో SD కార్డ్ స్లాట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇక ఈ మొబైల్‌కి సంబంధిన ధర వివరాల్లోకి వెళితే, 128GB స్టోరేజ్ వేరియంట్ కలిగిన మొబైల్ ధర రూ. 10,250లతో లభిస్తోంది. ఈ మొబైల్‌కి సంబంధించిన మొదటి సేల్ జూన్ 5 నుంచి ఇండోనేషియాలో ప్రారంభం కానుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్‌లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి