Realme 12 Plus: 16 జీబీ ర్యామ్, 50 మెగాపిక్సెల్ కెమేరాతో Realme 12 Plus త్వరలో లాంచ్ , ఫీచర్లు ఇలా

Realme 12 Plus: ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్ మి నుంచి వరుసగా లేటెస్ట్ స్మార్ట్ ఫోన్లు మార్కెట్‌లో లాంచ్ అవుతున్నాయి. ఇప్పుడు రియల్ మి నుంచి త్వరలో రియల్ మి 12 ప్లస్ , రియల్ మి 12 ప్రో ప్లస్ లాంచ్ కానున్నాయి. ఈ ఫోన్ల ఫీచర్లు ఇతర వివరాలు తెలుసుకుందాం.

Written by - Md. Abdul Rehaman | Last Updated : Feb 19, 2024, 07:40 PM IST
Realme 12 Plus: 16 జీబీ ర్యామ్, 50 మెగాపిక్సెల్ కెమేరాతో  Realme 12 Plus త్వరలో లాంచ్ , ఫీచర్లు ఇలా

Realme 12 Plus: రియల్ మి త్వరలో లాంచ్ చేయనున్న Realme 12 Plus, Realme 12 Pro Plus ఫోన్ల ఫీచర్లు లీక్ అయ్యాయి. ఈ రెండు స్మార్ట్‌ఫోన్ల లాంచ్ డేట్‌ను కంపెనీ ఇప్పటికే ప్రకటించింది. మలేషియాలో ఎప్పుుడు లాంచ్ అయ్యేది కంపెనీ తెలిపింది. అదే సమయంలో ఇండియన్ మార్కెట్‌లో ఎలా ఉంటుందనేది టీజర్ కూడా విడుదల చేసింది. 

Realme 12 Plus, Realme 12 Pro Plus స్మార్ట్‌ఫోన్లను కంపెనీ మలేషియాలో ఫిబ్రవరి 29న లాంచ్ చేయనుంది. ఈ ఫోన్ బీజ్, గ్రీన్ రంగుల్లో లభ్యం కానుంది. ఇండియాలో గత ఏడాది లాంచ్ అయిన రియల్ మి 12 ప్రో మోడల్‌లానే ఉంటుంది. అంతేకాకుండా రియల్ మి 12 ప్లస్ టీజర్ కంపెనీ ఇండియా అధికారిక వెబ్‌సైట్‌పై విడుదలైంది. అయితే ఆ పేజ్‌లో ఫోన్ పేరు అధికారికంగా వెల్లడించలేదు. కేవలం వన్ మోర్ ప్లస్ అని మాత్రమే ఉంది. 

రియల్ మి 12 ప్లస్ 5జి స్మార్ట్‌పోన్‌లో మీడియాటెక్ డైమెన్సిటీ 1080 ఎస్ఓసి ఉంటుందని తెలుస్తోంది. అంతేకాకుండా ఈ ఫోన్ 6జిబి, 8 జిబి, 12 జిబి, 16 జిబి ర్యామ్ కలిగి ఉండి 128 జీబీ, 256 జీబ, 512 జీబీ, 1టీబీ స్టోరేజ్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్ 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌డి ప్లస్ ఎమోల్డ్ డిస్‌ప్లేతో వస్తోంది. ఈ ఫోన్ బ్యాటరీ సామర్ధ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 

రియల్ మి 12 ప్లస్ 5జి స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ కెమేరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమేరా ప్రధానాకర్షణగా ఉండనుంది. ఇక సెల్ఫీ కోసం 16 మెగాపిక్సెల్ కెమేరా, మ్యాక్రో షూటర్ కోసం 2 మెగాపిక్సెల్ కెమేరా, 8 మెగాపిక్సెల్ సెన్సార్ అల్ట్రా వైడ్ లెన్స్ ఉంటాయి. ప్రస్తుతానికి ఈ ఫోన్ ధర ఇతర వివరాలు ఇంకా తెలియలేదు. కేవలం ఫీచర్ల గురించి మాత్రమే బయటికొచ్చింది. 

Also read: Intermittent Fasting: మధుమేహం వ్యాధిగ్రస్థులకు ఇంటర్‌మిట్టెంట్ ఫాస్టింగ్ మంచిదా కాదా

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News