Realme 12+ 5G: త్వరలో మార్కెట్లోకి రియల్‌మీ 12+.. తక్కువ ధర, కళ్లుచెదిరే ఫీచర్స్..

Realme 12+ 5G: రియల్‌మీ నుంచి మరో అదిరిపోయే స్మార్ట్ ఫోన్ రాబోతుంది. ఇది తక్కువ ధరలో అదిరిపోయే ఫీచర్స్ తో రాబోతుంది. పూర్తి వివరాలు తెలుసుకోండి.   

Written by - Samala Srinivas | Edited by - ZH Telugu Desk | Last Updated : Feb 18, 2024, 09:37 PM IST
Realme 12+ 5G: త్వరలో మార్కెట్లోకి రియల్‌మీ 12+.. తక్కువ ధర, కళ్లుచెదిరే ఫీచర్స్..

Realme 12+ 5G launch date in India:  చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్‌ దిగ్గజం రియల్‌మీ భారత మార్కెట్లోకి మరో నయా ఫోన్‌ను తీసుకురాబోతుంది. ఈ కొత్త ఫోన్‌ ఫిబ్రవరి 29న లాంచ్‌ చేయబోతున్నట్లు తెలుస్తోంది. రియల్‌మీ ఈ ఫోన్ కు సంబంధించి ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే దీనికి సంబంధించిన కొన్ని లీక్స్ బయటకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే తాజాగా ఈ ఫోన్‌కు సంబంధించి కంపెనీ ఒక చిన్న టీజర్‌ను రిలీజ్ చేసింది. ఇది మిడ్‌ రేంజ్‌ లో రాబోతున్నట్లు ప్రకటించింది. 

ఇక ఫీచర్లు విషయానికొస్తే.. ఈ ఫోన్ మీడియాటెక్‌ డైమెన్సిటీ 1080 ఎస్‌ఓసీ ప్రాసెసర్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ ఫోన్ 6జీబీ, 8జీబీ, 16జీబీ ర్యామ్‌ తోపాటు..128 జీబీ, 256 జీబీ, 512 జీబీ, 1 టీబీ స్టోరేజ్‌ వేరియంట్స్ లో తీసుకురాబోతున్నారు. ఈ మెుబైల్ 6.7 ఇంచెస్‌తో కూడిన ఫుల్‌ హెచ్‌డీ + అమోలోడ్ డిస్‌ప్లేతోపాటు 2,400 x 1,080 పిక్సెల్స్‌ రిజల్యూషన్‌ కలిగి ఉండనుంది. 

అంతేకాకుండా 50 మెగాపిక్సెల్స్‌, 8 మెగాపిక్సెల్స్‌, 2 మెగాపిక్సెల్స్‌తో కూడిన ట్రిపుల్‌ కెమెరా సెటప్ తో రాబోతుంది. ఇది 5000 ఎమ్‌ఏహెచ్‌ బ్యాటరీని కలిగి ఉంది. 16 మెగాపిక్సెల్స్‌ ఫ్రంట్ కెమెరాతో రానుంది. అయితే ఈ ఫోన్‌ ధర సుమారు రూ. 25 వేల నుంచి రూ. 30 వేల మధ్య ఉండొచ్చని అంచనా. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి. 

Also Read: Iqoo Z9 5G: ఇక Redmi, Realmeలకు బైబై..శక్తివంతమైన ఫీచర్స్‌తో Iqoo Z9 5G వచ్చేస్తోంది!

Also Read: ఇంగ్లీష్ బౌలర్లను ఊచకోత కోసిన యశస్వి.. వరుసగా రెండో డబుల్ సెంచరీ..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News