Realme 11 Pro: త్వరలోనే మార్కెట్‌లోకి Realme 11 Pro స్మార్ట్‌ఫోన్‌..డెడ్‌ ఛీప్‌ ధరలకే.. ఉచితంగా రూ. 4499 వాచ్ కూడా..

Realme 11 Pro: భారత్‌లో Realme 11 Pro స్మార్ట్‌ఫోన్‌ త్వరలోనే విడుదల కాబోతున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అన్ని వివరాలను కంపెనీ ఇప్పటికే వివరించింది. అయితే దీని ధరేంతో ఇప్పడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Jun 5, 2023, 09:26 PM IST
Realme 11 Pro: త్వరలోనే మార్కెట్‌లోకి Realme 11 Pro స్మార్ట్‌ఫోన్‌..డెడ్‌ ఛీప్‌ ధరలకే.. ఉచితంగా రూ. 4499 వాచ్ కూడా..

 

Realme 11 Pro: భారత మార్కెట్‌లో జూన్‌ నెలలో చాలా స్మార్ట్‌ ఫోన్స్‌ విడుదల అవుతున్నాయి. ముఖ్యంగా రియల్‌ మీ నుంచి 11 Pro,  Realme 11 Pro+ సిరీస్‌ ఈ నెలలో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతున్నాయి. అంతేకాకుండా నథింగ్‌ 2 స్మార్ట్‌ ఫోన్ కూడా విడుదలవుతుంది. అయితే ఇప్పటికీ ఈ స్మార్ట్‌ ఫోన్‌పై ప్రీ-ఆర్డర్ తేదీ కూడా అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా వీటిపై ఉచిత ప్రీ-ఆర్డర్ బహుమతులు కూడా ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. అయితే మొబైల్ సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.  

ఉచితంగా రూ. 4499 వాచ్:
Realme 11 ప్రో సిరీస్ సంబంధించిన పోస్టర్‌ను ఇప్పటికీ సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు. పోస్టర్ ప్రకారం..జూన్ 8 నుంచి Realme 11 Pro సిరీస్‌ను ఆఫ్‌లైన్‌లో ప్రీ-బుకింగ్‌లోకి అందుబాటులోకి రానున్నాయి. అంతేకాకుండా ప్రీ బుకింగ్‌ చేసుకున్నవారికి రూ. 4499 విలువైన Realme Watch 2 Proని ఉచితంగా బహుమతిగా ఇవ్వబోతున్నట్లు సమాచారం. 

భారత్‌లో Realme 11 Pro సిరీస్ ధర:
టిప్‌స్టర్ దేబాయన్ రాయ్ ప్రకారం.. భారతదేశంలో Realme 11 Pro ధర రూ. 22,000 నుంచి రూ. 23,000 మధ్య ఉంటుందని సమాచారం. అంతేకాకుండా Realme 11 Pro+ ధర సుమారు రూ. 28,000 నుంచి రూ. 29,000 ఉండబోతున్నట్లు దేబాయన్ రాయ్  తెలిపారు. 

Also Read: How To Control Diabetes: ఈ మూలికలతో తీవ్ర మధుమేహం ఒక్కరోజులో దిగి రావడం ఖాయం!

Realme 11 Pro సిరీస్ స్పెసిఫికేషన్‌లు:
డిస్‌ప్లే: 6.7-అంగుళాల కర్వ్డ్ AMOLED డిస్‌ప్లేతో పాటు పూర్తి HD+ (1080×2412 పిక్సెల్‌లు) రిజల్యూషన్‌తో లభించబోతున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్‌ ఫోన్‌ 120Hz రిఫ్రెష్ రేట్, 950nits పీక్ బ్రైట్‌నెస్, 50,00,000:1 కాంట్రాస్ట్ రేషియో, HDR10+ వంటి ఫీచర్లు ఉండబోతున్నట్లు తెలుస్తోంది. 
ప్రాసెసర్: MediaTek డైమెన్సిటీ 7050 ప్రాసెసర్, Mali G68 GPU.
మెమరీ స్టోరేజ్: 12GB వరకు RAM, 1TB రెండు వేరియంట్స్‌ లభించనున్నాయి.
సాఫ్ట్‌వేర్: ఆండ్రాయిడ్ 13 ఆధారంగా Realme UI 4.0.
కెమెరాలు: Realme 11 Pro+లో 200MP Samsung ISOCELL HP3 సెన్సార్, 8MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 2MP మాక్రో సెన్సార్ ఉన్నాయి. 
బ్యాటరీ, ఛార్జింగ్: 4870mAh బ్యాటరీని కలిగి ఉంటుంది. 11 ప్రో+లో 100W ఫాస్ట్ ఛార్జింగ్, 11 ప్రోలో 67W ఫాస్ట్ ఛార్జింగ్  సఫోర్ట్‌ కలిగి ఉంటుంది.
ఆడియో: డాల్బీ అట్మోస్‌తో స్టీరియో స్పీకర్లు.

Also Read: How To Control Diabetes: ఈ మూలికలతో తీవ్ర మధుమేహం ఒక్కరోజులో దిగి రావడం ఖాయం!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News