Realme 11 Pro Plus: రియల్ మీ(Realme) అధిక ధరలు కలిగిన ఫోన్‌లను విడుదల చేయడమేకాకుండా సాధరణ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్‌లను కూడా రిలీజ్ చేస్తుంది. ఇలాంటి ఫోన్‌లను విడుదల చేసేందుకు ఎప్పుడు రియల్ మీ ముందుంటుంది. అయితే ఇంతకముందు రియల్ మీ చాలా మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోన్‌లను విడుదల చేసింది. మిడిల్ క్లాస్ వినియోగదారులను దృష్టిలో పెట్టుకుని మరో ఫోన్‌ను విడుదల చేయబోతుంది. రిలీజ్ చేయబోయే కొత్త స్మార్ట్ ఫోన్ ఏమిటో దానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రియల్ మీ మిడ్-రేంజ్‌లో రియల్ మీ 11 ప్రో (Realme 11 Pro) సిరీస్‌ను వినియోగదారులకు పరిచయం చేయబోతోంది. ఇదే సంవత్సరంలో అతి తక్కువ ధరలో రియల్ మీ 11 ప్రో సిరీస్‌తో పాటు రియల్ మీ 11 ప్రో ప్లాస్ (Realme 11 Pro Plus) రిలీజ్ చేయబోతునట్లు సమాచారం. ఈ సిరీస్ టాప్ వేరియంట్ ఫోన్‌లో "మూన్ మోడ్" ఫీచర్‌ను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతున్నారు. దీనికి సంబంధించిన సమాచారం వీబోలో సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
చంద్రుని ఫిక్స్ కూడా ఇలా తీయోచ్చు:
రియల్ మీ 11 ప్రో ప్లాస్‌లో "మూన్ మోడ్" ఫీచర్ అందుబాటులోకి రాబోతోంది. కాబట్టి Galaxy S23 Ultra కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్ ద్వారా కూడా మూన్ షాట్‌లను క్యాప్చర్ చేసేందుకు వీలుంటుంది. ప్రస్తుతం ఈ ఫీచర్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లలో మాత్రమే అందుబాటులో ఉంది. అయితే ఈ మూన్ మోడ్ ఫీచర్ ఫీచర్ ఎలా పని చేస్తుందో అనే విషయం ఇప్పటికీ స్పష్టత లేదు. అంతేకాకుండా ఈ స్మార్ట్ ఫోన్‌లో టెలిఫోటో కెమెరా యూనిట్ ఫీచర్ కూడా అందుబాటులో ఉంది.
Also Read: Virupaksha Collections : బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో విరూపాక్ష.. దుమ్ములేపేస్తోన్న మెగా హీరో
రియల్ మీ 11 ప్రో ప్లాస్ (Realme 11 Pro Plus) ఫీచర్స్:
స్పెసిఫికేషన్ విషయానికి వస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7-అంగుళాల ఫుల్ HD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. AMOLED ప్యానెల్, 2.6GHz క్లాక్‌తో కూడిన మీడియాటెక్ డైమెన్సిటీ 7000-సిరీస్ ప్రాసెసర్‌తో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ఇందులో 7000-సిరీస్ ప్రాసెసర్ కూడా రానుంది. ఇది 1 TB స్టోరేజ్ రేంజ్‌ను కలిగి ఉండే అవకాశాలున్నాయి. ఇక కెమెరా విషయానికొస్తే 200 మెగాపిక్సెల్‌ల వరకు ఉంటుదని సమాచారం.
రియల్ మీ 11 ప్రో ప్లాస్ (Realme 11 Pro Plus) ధర:
రియల్ మీ 11 ప్రో ప్లాస్ చైనా లాంచ్ చేసిన తర్వాత భారతదేశంలో విడుదల చేసే ఛాన్స్ ఉంది. దీని ధర రూ.30,000 లోపు ఉండవచ్చని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఫోన్ ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో కూడా వస్తుంది. కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్ ధర అనుకున్న దాని కంటే ఎక్కువగా ఉండే ఛాన్స్ ఉంది. అయితే దీనికి సంబంధించిన స్పెసిఫికేషన్‌ల వివరాలు ఇంకా పూర్తిగా తెలియాల్సి ఉంది.
Also Read: Virupaksha Collections : బ్రేక్ ఈవెన్‌కు దగ్గర్లో విరూపాక్ష.. దుమ్ములేపేస్తోన్న మెగా హీరో
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter, Facebook