Realme 11 5G Price: దీపావళి స్పెషల్‌ డీల్‌లో Realme 11 5G మొబైల్‌పై రూ.4,000 వరకు అదనపు తగ్గింపు..పూర్తి వివరాలు ఇవే!

Realme 11 5G Price: దీపావళి పండగ సందర్భంగా రియల్ మీ అధికారిక వెబ్‌సైట్‌లో కొన్ని స్మార్ట్‌ ఫోన్స్‌పై స్పెషల్ డీల్ నడుస్తోంది. ఈ డీల్స్‌ భాగంగా Realme 11 5G మొబైల్‌ను కొనుగోలు చేస్తే భారీ తగ్గింపును పొందుతారు. అదనంగా బ్యాంక్‌ ఆఫర్స్‌ కూడా పొందుతారు. 

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 5, 2023, 12:28 PM IST
Realme 11 5G Price: దీపావళి స్పెషల్‌ డీల్‌లో Realme 11 5G మొబైల్‌పై రూ.4,000 వరకు అదనపు తగ్గింపు..పూర్తి వివరాలు ఇవే!

 

Realme 11 5G Price: దీపావళి సందర్భంగా అన్ని ఎలక్ట్రిక్‌, టెక్‌ కంపెనీల అధికారిక వెబ్‌సైట్స్‌లో ఫెస్టివ్ డే సేల్స్‌ ప్రారంభమయ్యాయి. ఈ సేల్స్‌లో భాగంగా అన్ని రకాల వస్తువులు భారీ తగ్గింపు లభిస్తున్నాయి. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్స్‌ ఈ సేల్స్‌లో అతి తక్కువ ధరలకే అందుబాటులో ఉన్నాయి. Realme వెబ్‌సైట్‌లో ప్రారంభమైన  ఫెస్టివ్ డే సేల్‌లో భాగంగా కొన్ని రియల్‌ మొబైల్స్‌ డెడ్‌ చీప్‌ ధరల్లోనే లభిస్తున్నాయి. అంతేకాకుండా అదనంగా బ్యాంక్‌ డిస్కౌంట్‌ ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ సేల్‌లో ఏ స్మార్ట్‌ ఫోన్‌ భారీ తగ్గింపుతో లభిస్తోందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 

Realme వెబ్‌సైట్‌లో Realme 11 5G మొబైల్‌పై స్పెషల్ డీల్ అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్‌ 108 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరాతో పాటు 67 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్‌ అధికారిక వెబ్‌సైట్‌లో MRP రూ. 18,999తో అందుబాటులో ఉంది. దీపావళి పండగ సందర్భంగా ఈ స్మార్ట్‌ ఫోన్‌ రూ.2,000 తగ్గింపుతో రూ.16,999కే పొందవచ్చు. దీంతో పాటు ఈ మొబైల్‌పై మీరు అదనంగా రూ.2,000 కూపన్‌ను కూడా పొందవచ్చు. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే దాదాపు రూ.14,999కే పొందుతారు. అంతేకాకుండా ఈ మొబైల్‌పై ఇతర తగ్గింపు ఆఫర్స్‌ కూడా అందుబాటులో ఉన్నాయి. దీని కోసం మీరు రియల్‌ మీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాల్సి ఉంటుంది. 

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

Realme 11 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్‌లు:
6.72 అంగుళాల ఫుల్ హెచ్‌డి+ డిస్‌ప్లే
1080x2400 పిక్సెల్ రిజల్యూషన్‌
120Hz రిఫ్రెష్ రేట్
180Hz టచ్ శాంప్లింగ్ రేట్‌
680 నిట్‌ల బ్రైట్‌నెస్‌ సపోర్ట్‌
8 GB RAM + 256 GB
8 GB వరకు డైనమిక్ ర్యామ్‌
MediaTek Dimension 6100+ 5G చిప్‌సెట్‌
LED ఫ్లాష్‌తో డబుల్‌ కెమెరా సెటప్‌
108 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా
2 మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ కెమెరా
ప్రధాన కెమెరా 3x జూమ్‌
16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
5000mAh బ్యాటరీ
67 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News