Oppo A3 Pro 5G: ప్రముఖ స్మార్ట్ఫన్ కంపెనీ వీవో గుడ్ న్యూస్ తెలపబోతోంది. త్వరలోనే లాంచ్ కాబోయే Oppo A3 ప్రో 5G స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన వివరాలు ఇటీవలే లీక్ అయ్యాయి . గత వారం టిప్‌స్టర్ స్టీవ్ హెమ్మర్‌స్టోఫర్ తెలిపిన వివరాల ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ త్వరలోనే చైనా మార్కెట్లోకి విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధిచిన డిజైన్‌తో పాటు కలర్స్‌ను కూడా కంపెనీ లాంచ్ చేయబోతున్నట్లు వెల్లడించింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్ గతంలో లాంచ్ అయిన OPPO A38 మొబైల్ కంటే అనేక శక్తివంతమైన ఫీచర్స్‌ను కలిగి ఉంటుంది. ఇటీవలే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన లీక్ అయిన వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
అధికారిక Weibo సైట్లో వివరించిన వివరాల ప్రకారం.. Oppo A3 Pro 5G స్మార్ట్‌ఫోన్ చైనాలో ఏప్రిల్ 12వ తేదిన విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ రెడ్మీ కూడా తమ Redmi Turbo 3ని ఏప్రిల్ 10న లాంచ్ కాబోతున్నట్లు సమాచారం. అలాగే ఈ మొబైల్ లాంచ్ అయిన ఒక రోజు తర్వాత Oppo సబ్-బ్రాండ్ Realme తన GT Neo 6 SE మొబైల్‌ను కూడా విడుదల చేయబోతోంది. ఇవే కాకుండా చైనాలో ఇతర బ్రాండ్లకు సంబంధించిన స్మార్ట్‌ఫోన్స్ కూడా విడుదల కాబోతున్నట్లు సమాచారం.
స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఈ A3 ప్రో మోడల్‌ను మొత్తం మూడు (అజూర్, యున్ జిన్ పౌడర్ (రోజ్), మౌంటైన్ బ్లూ) కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. అంతేకాకుండా ఇది వేగన్ బ్యాక్ లెదర్ ఆప్షన్స్‌లో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఈ స్మార్ట్‌ఫోన్ 162.7 x 74.5 x 7.8 మిమీ కొలతలతో లభిస్తోంది. అంతేకాకుండా ఇది 6.7 అంగుళాల డిస్ప్లేలను కలిగి ఉంటుంది. అంతేకాకుండా ఫ్రంట్ సెటప్‌లో పంచ్-హోల్ కెమెరాతో అందుబాటులోకి రాబోతోంది.
Oppo A2 ప్రో స్పెసిఫికేషన్లు:
6.7-అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే
FHD+ రిజల్యూషన్
920 nits పీక్ బ్రైట్నెస్
120Hz రిఫ్రెష్ రేట్
డైమెన్సిటీ 7050 ప్రాసెసర్
64-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్
2-మెగాపిక్సెల్ పోర్ట్రెయిట్ సెన్సార్
8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా
5,000mAh బ్యాటరీ
ఆండ్రాయిడ్ 13 ఆధారిత ColorOS 13.1 ఆపరేటింగ్ సిస్టమ్
బ్లూటూత్ 5.2
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి