Oppo A3 Pro 5G: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ ఒప్పో తమ కస్టమర్స్‌కి గుడ్ న్యూస్ తెలిపింది. అతిశక్తి వంతమైన Oppo A3 Pro 5G స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. అయితే విడుదలకు ముందే ఈ స్మార్ట్‌ఫోన్‌కి మార్కెట్లో మంచి గుర్తింపు లభించింది. మంచి మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు తప్పకుండా మరికొన్ని రోజు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను మార్కెట్లోకి లాంచ్ అయిన వెంటనే అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీనిని కంపెనీ ముందుగా చైనాలో అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఆ తర్వాత ప్రపంచ మార్కెట్లోకి అందుబాటులో రాబోతోంది. ఇప్పటికే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. అయితే ఈ మొబైల్‌కి సంబంధించి ఫీచర్స్ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
అంతేకాకుండా ఇటీవలే ఈ Oppo A3 Pro 5G స్మార్ట్‌ఫోన్ ఇండోనేషియా సంబంధించిన SDPPIలో కనిపించడం విశేషం. ఇప్పటికే ఇది వివిధ రకాల టెస్టుల్లో పాస్ అయినట్లు తెలుస్తోంది. ఇది మార్కెట్లోకి CPH2639 మోడల్ నంబర్‌తో అందుబాటులోకి రాబోతోంది. దీంతో పాటు 45 వాట్ల వరకు ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు ఇది ఎంతో శక్తివంతమైన 5000mAh బ్యాటరీ సెటప్‌తో అందుబాటులోకి రానుంది. ఇవే కాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌లో వివిధ రకాల శక్తివంతమైన ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ అందుబాటులోకి రానున్నాయి.
Oppo A3 Pro 5G ఫీచర్లు, స్పెసిఫికేషన్లు:
ఈ Oppo A3 Pro 5G మొబైల్ 6.7 అంగుళాల ఫుల్ HD+ AMOLED డిస్ప్లేతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఈ స్క్రీన్ 120Hz రిఫ్రెష్ రేట్‌కు సపోర్ట్ చేస్తుంది. దీంతో పాటు ఇది గరిష్టంగా 950 నిట్ల వరకు బ్రైట్నెస్ను కలిగి ఉంటుంది. దీంతో పాటు 12 GB LPDDR4x ర్యామ్, 512 GB ఇంటర్నల్ స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రాబోతోంది. అలాగే ఇది 12 GB వరకు వర్చువల్ ర్యామ్‌తో సెటప్‌ను కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా MediaTek Dimension 7050 చిప్‌సెట్‌పై రన్ అవుతుంది. అంతేకాకుండా ఈ స్మార్ట్‌ఫోన్‌లోని ర్యామ్‌ను 24 జీబీ వరకు పెంచుకునే ప్రత్యేకమైన ఫీచర్‌ను కూడా కలిగి ఉంటుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
ఇతర ఫీచర్స్, స్పెషిఫికేషన్స్:
డబుల్ కెమెరా సెటప్
LED ఫ్లాష్
64-మెగాపిక్సెల్ మెయిన్ లెన్స్
2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్
8 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా
డ్యూయల్ సిమ్ సపోర్ట్
5 జి కనెక్టివిటీ
వై-ఫై 6
బ్లూటూత్ 5.3
జిపిఎస్
యుఎస్బి టైప్-సి పోర్ట్
ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్
ఆండ్రాయిడ్ 14 ఆధారంగా కలర్ OS 14
IP69 రేటింగ్
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి