.
Oneplus Nord CE4 Price Dropped: ప్రముఖ స్మార్ట్‌ఫోన్ కంపెనీ వన్ ప్లస్‌కి మార్కెట్లో గణనీయమైన ప్రజాదరణ లభించింది. ఎందుకంటే గత కొన్ని సంవత్సరాల నుంచి ఈ కంపెనీ స్మార్ట్ ఫోన్స్‌ను రెండు సెగ్మెంట్లలో మార్కెట్లోకి విడుదల చేశాయి. ఇందులో మొదటిది మిడిల్ రేంజ్ బడ్జెట్ మొబైల్ అయితే, రెండవది ఖరీదైన స్మార్ట్ ఫోన్స్‌ను విక్రయిస్తూ వస్తోంది. వీటిల్లో చాలామంది ఎక్కువగా మిడిల్ రేంజ్ బడ్జెట్లో లభించే మొబైల్స్‌ను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. అంతేకాకుండా ఇవి ప్రీమియం ఫీచర్స్‌తో మార్కెట్లోకి రావడంతో యువత ఎక్కువగా వీటికి ఆకర్షితులు అవుతున్నారు. గత కొన్ని సంవత్సరాల కింద ఉన్న వన్ ప్లస్ డిమాండ్‌తో పోలిస్తే ఇప్పుడున్న డిమాండ్ గణనీయంగా పెరిగిపోయింది.
దీనిని దృష్టిలో పెట్టుకొని కంపెనీ కొత్త కొత్త మొబైల్స్ విడుదల చేస్తోంది. అయితే ఇటీవలే వన్‌ప్లస్ నార్డ్ CE4 (Oneplus Nord CE4) స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. దీనికి మార్కెట్లో గుర్తింపు లభించింది. ఇదిలా ఉండగా ఈ మొబైల్ పై ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్ కూడా అందిస్తోంది. అయితే ఈ మొబైల్‌పై ఉన్న డిస్కౌంట్ ఆఫర్స్ వివరాలు ఏంటి? ఎలా కొనుగోలు చేస్తే అతి తక్కువ ధరలో లభిస్తుందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రస్తుతం ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్‌లో ఈ స్మార్ట్ ఫోన్ రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో అందుబాటులో ఉంది. అలాగే రెండు స్టోరేజ్ ఆప్షన్స్‌లో లభిస్తోంది. 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన ఈ స్మార్ట్ ఫోన్ ధర రూ. 26,999కాగా, 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ కలిగిన వేరియంట్ రూ.24 వేల లోపే లభిస్తోంది. ఇక ఈ మొబైల్‌పై అమెజాన్ ప్రత్యేకమైన డిస్కౌంట్ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్స్ ను వినియోగించి కొనుగోలు చేసే వారికి అతి తక్కువ ధరలోని ఈ స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేయవచ్చు. బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా HDFC బ్యాంక్, IDFC బ్యాంక్, వన్ కార్డు క్రెడిట్ కార్డును వినియోగించి బిల్ చెల్లించే వారికి దాదాపు రూ.1,500 వరకు తగ్గింపు లభిస్తుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
అంతేకాకుండా ఈ వన్‌ప్లస్ నార్డ్ CE4 (Oneplus Nord CE4) స్మార్ట్ ఫోన్ పై ప్రముఖ ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ ప్రత్యేకమైన ఎక్స్చేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్ పై మీ పాత స్మార్ట్ ఫోన్ ఎక్స్చేంజ్ చేసి ఈ వన్‌ప్లస్ నార్డ్ CE4 మొబైల్‌ను కొన్ని బ్యాంకులకు సంబంధించిన క్రెడిట్ కార్డులతో బిల్ చెల్లిస్తే దాదాపు రూ. 23,700 వరకు తగ్గింపు లభిస్తుంది. దీంతోపాటు అదనంగా ఇతర కూపన్స్ కూడా లభిస్తాయి. దీంతో అన్ని డిస్కౌంట్ ఆఫర్స్ పోను వన్‌ప్లస్ నార్డ్ CE4 స్మార్ట్ ఫోన్ రూ.3,500లోపే పొందవచ్చు. ఇవే కాకుండా ఈ స్మార్ట్ ఫోన్ పై నో కాస్ట్ EMI ఆప్షన్ కూడా అందుబాటులో ఉంది. దీనిని వినియోగించి కొనుగోలు చేస్తే బ్యాంక్ ఆఫర్స్‌లో భాగంగా మరింత తగ్గింపు లభిస్తుంది.
Also Read 2024 Bajaj Pulsar N250: మార్కెట్లోకి కొత్త పల్సర్ N250 వచ్చేసింది.. ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ ఇవే!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి