Oneplus Nord Ce 4 5G Price: 256GB స్టోరేజ్‌తో రూ.23లోపే అద్భుతమైన ఫీచర్స్‌ Oneplus మొబైల్ రాబోతోంది.. ధర వివరాలు ఇవే..

Oneplus Nord Ce 4 5G Price: వన్‌ప్లస్‌ నార్డో CE 4 5G స్మార్ట్‌ఫోన్‌ త్వరలోనే మార్కెట్‌లోకి లాంచ్‌ కాబోతోంది. దీనికి సంబంధించిన ఫీచర్స్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 12, 2024, 10:40 AM IST
Oneplus Nord Ce 4 5G Price: 256GB స్టోరేజ్‌తో రూ.23లోపే అద్భుతమైన ఫీచర్స్‌ Oneplus మొబైల్ రాబోతోంది.. ధర వివరాలు ఇవే..

Oneplus Nord Ce 4 5G Price: వన్‌ప్లస్‌ తమ వినియోగదారులకు మరో గుడ్‌ న్యూస్‌ తెలిపింది. ఏప్రిల్‌ 1వ తేదిన వన్‌ప్లస్‌ కంపెనీ నార్డో CE 4 5G మోడల్‌ను లాంచ్ చేస్తోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన వివరాలు అమెజాన్‌ అధికారిక వెబ్‌సైట్‌లోని మీని సైట్‌లో లైవ్‌ అవుతున్నాయి. అంతేకాకుండా ఇప్పటికే కంపెనీ ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ కూడా వెల్లడించింది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌ చాలా శక్తివంతమైన ఫీచర్స్‌తో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇప్పటికే ఈ మొబైల్‌కి సంబంధించిన ఫీచర్స్‌ కూడా సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.    

ఈ వన్‌ప్లస్‌  నార్డో CE 4 5G స్మార్ట్‌ఫోన్‌ మొత్తం రెండు స్టోరేజ్ వేరియంట్స్‌లో అందుబాటులోకి రాబోతోంది. అందులో మొదటిది 8GB ర్యామ్, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ అయితే..రెండవది 8GB ర్యామ్‌, 256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఆప్షన్‌తో అందుబాటులోకి రాబోతోంది. అయితే ఇటీవలే ఈ మొబైల్‌కి సంబంధించిన ధరలు కూడా లీక్‌ అయ్యియి. ఇందులో మొదటి వేరియంట్‌ 8GB + 128GB మొబైల్‌ ధర రూ.23,999తో అందుబాటులోకి రానుంది. రెండవ వేరియంట్‌ 8GB + 256GB స్టోరేజ్‌తో రూ.25,999లకు లభించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. 

వన్‌ప్లస్‌ నార్డో CE 4 5G ఫీచర్స్‌, ఇతర వివరాల్లోకి వెళితే..ఇది 6.73-అంగుళాల AMOLED డిస్ప్లేతో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ఈ స్క్రీన్‌  1080 x 2412 పిక్సెల్‌ల రిజల్యూషన్‌, 120Hz రిఫ్రెష్ రేట్‌, HDR10+ సపోర్ట్‌తో రాబోతోంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్‌తో పాటు 2.63 GHz ఆక్టా-కోర్ CPUతో అందుబాటులోకి రానుంది. దీంతో ఈ వన్‌ప్లస్‌ నార్డో CE 4 5G స్మార్ట్‌ఫోన్‌ Adreno 730 GPU సపోర్ట్‌తో లభిస్తోంది. అలాగే ఇవే కాకుండా ఎన్నో రకాల శక్తివంతమైన ఫీచర్స్‌ కలిగి ఉన్నాయి.  

Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!

ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన స్టోరేజ్‌ వివరాల్లోకి ఇది 8GB ర్యామ్‌, 128GB/256GB స్టోరేజ్‌ ఆప్షన్స్‌లో లభిస్తోంది. అంతేకాకుండా అదనంగా మోమోరీ పొందడానికి మైక్రో SD కార్డ్‌ స్లాట్‌ కూడా లభిస్తోంది. ఇక ఈ వన్‌ప్లస్‌ నార్డో CE 4 5G స్మార్ట్‌ఫోన్‌ కెమెరా వివరాలు చూస్తే, ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో లభిస్తోంది. ఇందులోని బ్యాక్‌ సెటప్‌లో 64MP ప్రధాన కెమెరా, 8MP అల్ట్రా-వైడ్ కెమెరా, 2MP మాక్రో కెమెరాతో లభిస్తోంది. వీడియో కాలింగ్‌ కోసం, 16MP ఫ్రంట్ కెమెరాతో అందుబాటులోకి రాబోతోంది. ఇది 5000mAh బ్యాటరీ, 80W SuperVOOC ఫాస్ట్ చార్జింగ్‌ సపోర్ట్‌తో రాబోతోంది.

Also Read Free Fire MAX Free Download: ఫ్రీ డైమాండ్స్‌, కరెన్సీతో Garena Free Fire MAXని ఫ్రీగా డౌన్‌లోడ్ చేసుకోండి!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News