Oneplus 12R Sales: 100 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమేరాతో వన్‌ప్లస్ 12ఆర్ అమ్మకాలు ప్రారంభం

Oneplus 12R Sales live on Amazon: వన్‌ప్లస్ ప్రేమికులకు గుడ్‌న్యూస్. ఇటీవల ఇండియాలో లాంచ్ అయిన వన్‌ప్లస్ 12ఆర్ జెన్‌షిన్ ఇంపాక్ట్ ఎడిషన్ అమ్మకాలు ఇవాళ్టి నుంచి ప్రారంభమయ్యాయి. ప్రారంభ ఆఫర్ కింద చాలా ప్రయోజనాలు అందనున్నాయి. ఆ వివరాలు మీ కోసం..

Written by - Md. Abdul Rehaman | Last Updated : Mar 20, 2024, 11:47 AM IST
Oneplus 12R Sales: 100 వాట్స్ సూపర్ ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమేరాతో వన్‌ప్లస్ 12ఆర్ అమ్మకాలు ప్రారంభం

Oneplus 12R Sales live on Amazon: ఆపిల్ ఫోన్ తరువాత అత్యంత ఎక్కువగా ఇష్టపడే ఫోన్ వన్‌ప్లస్. అద్భుతమైన ఫీచర్లతో ప్రత్యేకంగా గేమింగ్ అనుభూతి కోసం రూపొందిన OnePlus 12R Genshin Impact Edition అమ్మకాలు ఇవాళ్టి నుంచి ప్రముఖ ఈ కామర్స్ వేదిక అమెజాన్‌లో ప్రారంభమయ్యాయి. ప్రారంభ ఆఫర్‌లో భాగంగా వన్‌ప్లస్ 12ఆర్ ఇంపాక్ట్ ఎడిషన్ కొనుగోలుపై ప్రత్యేక బహుమతులు కూడా లభించనున్నాయి.

OnePlus 12R Genshin Impact Edition అనేది 6.78 ఇంచెస్ ఎమోల్డ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా ఆక్సిజన్ ఓఎస్ 14తో పనిచేస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ ఎస్ఓసి చిప్‌సెట్ కలిగి ఉంటుంది. ఇందులో ట్రిపుల్ కెమేరా సెటప్ ఉంటుంది. 50 మెగాపిక్సెల్ సోనీ కెమేరాతో 8 మెగాపిక్సెల్ యాంగిల్ కెమేరా, 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమేరా ఈ ఫోన్ ప్రత్యేకత. అంతేకాకుండా సెల్ఫీ లేదా వీడియా కాలింగ్ కోసం 16 మెగాపిక్సెల్ కెమేరా ఉంటుంది. 

ఇక ఛార్జింగ్ విషయంలో మరే ఇతర ఫోన్ పనికిరాదనే చెప్పాలి. ఏకంగా 100 వాట్స్ సూపర్ వూక్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 5000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యం కలిగి ఉంటుంది. బ్లూటూత్ 5.3, వైఫై 7 , జీపీఎస్ వంటి కనెక్టివిటీ సౌకర్యాలున్నాయి. ఇందులో గైరోస్కోప్, యాక్సిలిరోమీటర్, మాగ్నిటోమీటర్, ప్రాక్సీమిటీ సెన్సార్ ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్ కొనుగోలుతో పాటు పర్పుల్ కలర్ ఛార్జర్, ఫోన్ కేస్, సిమ్ టూల్, ఫాస్ట్ ఛార్జింగ్ కేబుల్, ఫోన్ స్టాండ్, కస్టమైజ్డ్ స్టిక్కర్లు అందుతాయి 

ఇక వన్‌ప్లస్ 12ఆర్ జెన్‌షిన్ ఇంపాక్ట్ ఎడిషన్ 16జీబీ ర్యామ్, 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర 49,999 రూపాయలు కాగా వన్ కార్డ్ ద్వారా 1000 రూపాయలు డిస్కౌంట్ లభిస్తుంది. అంతేకాకుండా 4000 రూపాయలు ఎక్స్చేంజ్ బోనస్ కూడా లభిస్తుంది. 

Also read: Heavy Rains Alert: ఏపీలోని ఈ జిల్లాలకు రెండ్రోజులు భారీ వర్ష సూచన

 స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News