Oneplus 12 Price: గుడ్‌ న్యూస్‌..తక్కువ ధరకే మార్కెట్‌లోకి OnePlus 12 సిరీస్‌లు..

Oneplus 12 Price: ప్రముఖ టెక్‌ దిగ్గజం వన్‌ప్లస్‌ మార్కెట్‌లోకి మరో స్మార్ట్‌ ఫోన్‌ను ఈ జనవరి చివరి వారంలో విడుదల చేయబోతోంది. ఈ మొబైల్‌ను OnePlus 12 మోడల్‌తో విడుదల కాబోతోంది. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 11, 2024, 01:26 PM IST
Oneplus 12 Price: గుడ్‌ న్యూస్‌..తక్కువ ధరకే మార్కెట్‌లోకి OnePlus 12 సిరీస్‌లు..

Oneplus 12 Price: వన్‌ప్లస్‌ లవర్స్‌కి గుడ్‌ న్యూస్‌..కంపెనీ అతి త్వరలోనే మార్కెట్‌లోకి OnePlus 12 సిరీస్‌ను విడుదల చేయబోతున్నట్లు వెల్లడించింది. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌ విడుదలకు సంబంధించి అధికారిక ప్రకటను కంపెనీ వెల్లడించలేదు. ఈ సిరీస్‌ మొబైల్స్ ప్రీమియం లుక్‌తో బడ్జెట్‌లో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ స్మార్ట్ ఫోన్‌ను కంపెరీ చైనాలో విడుదల చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో కంపెనీ భారత్‌లో విడుదల చేసేందుకు కూడా సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ జనవరి 23న భారత్‌లో విడుదల చేయబోతున్నట్లు సంచారం. అయితే ఈ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.

OnePlus 12 స్మార్ట్‌ఫోన్ లాంచింగ్ వివరాలు:
ప్రీమియం బడ్జెట్‌లో మంచి మొబైల్‌  కొనుగోలు చేయాలనుకునేవారు వచ్చే నెల వరకు వెయిట్‌ చేయాల్సి ఉంటుంది. OnePlus 12 స్మార్ట్ ఫోన్‌ జనవరి 23 మార్కెట్‌లోకి విడుదలై..ఫిబవరి నెలలో అందుబాటులోకి రానుంది. కంపెనీ ఈ మొబైల్‌ను ముందుగా బేస్ వేరియంట్‌లో విడుదల చేయనుంది. ఈ మొబైల్‌ బేస్‌ వేరియంట్‌ ధర సుమారు రూ.60,000 కంటే తక్కువగా ఉండవచ్చని టిప్‌స్టర్స్‌ తెలుపుతున్నారు. అయితే విడుదలకు ముందే ఈ స్మార్ట్‌ ఫోన్‌కి సంబంధించిన ఫీచర్స్‌, స్పెషిఫికేషన్స్‌ వైరల్‌ అవుతున్నాయి.

స్నాప్‌డ్రాగన్ 8 Gen 3 ప్రాసెసర్:
టిప్‌స్టర్‌ తెలిపిన వివరాల ప్రకారం..

 OnePlus 12 స్మార్ట్‌ ఫోన్‌ Qualcomm ఫ్లాగ్‌షిప్ ప్రాసెసర్ Snapdragon 8 Gen 3పై రన్‌ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ అత్యాధునిక చిప్‌సెట్ వన్-డివైస్ AIకి కూడా సపోర్ట్‌ చేసే విధంగా రూపొందిచారని టిప్‌స్టర్స్‌ తెలిపారు. ఇందులో AI సంబంధిత పనులను సులభంగా చేసుకునే విధంగా అనేక రకాల ఫీచర్స్‌తో రాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ 6.82-అంగుళాల QHD+ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. దీంతో పాటు 4,500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌కు సపోర్ట్ ఇస్తుంది. దీంతో పాటు దీని డిస్‌ప్లే డాల్బీ విజన్, 10-బిట్ కలర్ డెప్త్, ప్రోఎక్స్‌డిఆర్‌కు సపోర్ట్‌ చేస్తుంది. 

Also read: Bhogi Pallu 2024: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు? ఇది తెలిస్తే తప్పకుండా మీ పిల్లలకు కూడా పోస్తారు..

5,400 mAh బ్యాటరీ:
ఛార్జింగ్ విషయంలో కూడా కంపెనీ ఏ మాత్రం తగ్గలేదు. ఈ OnePlus 12 స్మార్ట్‌ ఫోన్‌ 50W వైర్‌లెస్ ఛార్జింగ్, 100W వైర్డ్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ను కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ బ్యాటరీ కేవలం 26 నిమిషాల్లో 0 నుంచి 100% వరకు పూర్తిగా ఛార్జ్ అవుతుందని కంపెనీ పేర్కొంది. దీంతో పాటు ఈ మొబైల్‌ 5,400 mAh బ్యాటరీతో రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా అందుబాటులో ఉంది.

Also read: Bhogi Pallu 2024: భోగి పండగ రోజే పిల్లలకు భోగి పండ్లను ఎందుకు పోస్తారు? ఇది తెలిస్తే తప్పకుండా మీ పిల్లలకు కూడా పోస్తారు..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

 సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News