Motorola Razr 40 Ultra Price: కొత్త లుక్‌తో మార్కెట్‌లోకి Motorola Razr 40 Ultra ఫోల్డబుల్ మొబైల్‌..ధరెంతో తెలుసా?

Motorola Razr 40 Ultra Price India: ఇటీవలే మోటరోలా (Motorola) విడుదల చేసిన  ఫోల్డబుల్ మొబైల్‌ Moto Razr 40 Ultraను కంపెనీ మరో కొత్త రంగులో విడుదల చేసింది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ సరికొత్త ప్రీమియం లుక్‌తో గ్లేసియర్ బ్లూ కలర్ వేరియంట్‌లో రిలీజ్‌ చేసింది.   

Written by - ZH Telugu Desk | Last Updated : Nov 13, 2023, 11:24 AM IST
Motorola Razr 40 Ultra Price: కొత్త లుక్‌తో మార్కెట్‌లోకి Motorola Razr 40 Ultra ఫోల్డబుల్ మొబైల్‌..ధరెంతో తెలుసా?

 

Motorola Razr 40 Ultra Price India: మోటరోలా (Motorola) తమ ఫోల్డబుల్ ఫోన్‌ను కొత్త రంగులో విడుదల చేసింది. ఇటీవలే విడుదల చేసిన Moto Razr 40 Ultra స్మార్ట్‌ఫోన్‌ మరో కొత్త కలర్‌ వేరియంట్‌లో విడుదలైంది. మోటరోలా Razr 40, Moto Razr 40 Ultra క్లామ్‌షెల్ ఫోల్డబుల్ స్మార్ట్‌ ఫోన్‌ను కంపెనీ జూలైలో విడుదల చేయగా ఇటీవలే గ్లేసియర్ బ్లూ కలర్ వేరియంట్‌ను లాంచ్‌ చేసింది. ఈ ఫోల్డబుల్ మొబైల్‌ ఇంతకు ముందు వివా మెజెంటా, ఫాంటమ్ బ్లాక్ కలర్స్‌లో అందుబాటులో ఉండగా..మోటో లైనప్‌కి కొత్త గ్లేసియర్ బ్లూ వేరియంట్‌ను అందించింది. 

ఈ Moto Razr 40 Ultra ఫోల్డబుల్ మొబైల్‌ పూర్తి-స్క్రీన్ కవర్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఈ స్మార్ట్‌ ఫోన్‌ Qualcomm Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్‌పై రన్‌ అవుతుంది. మొదట ఈ మొబైల్‌ 8GB +  256GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ వేరియంట్‌లో విడుదల చేసింది. ఈ Moto Razr 40 Ultra ఫోల్డబుల్ మొబైల్‌ Android 13పై పని చేస్తుంది. అంతేకాకుండా అనేక రకాల కొత్త ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి విడుదల చేసింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌కి సంబంధించి మరిన్ని వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. 

Moto Razr 40 Ultra ధర, డిస్కౌంట్‌ వివరాలు:
ప్రస్తుతం మోటో Razr 40 Ultra Glacier Blue స్మార్ట్‌ ఫోన్‌ అమెజాన్‌లో అందుబాటులో ఉంది. ఈ మొబైల్‌ MRP ధర రూ.1,19,999 కాగా ప్రత్యేక డీల్‌లో భాగంగా 33 శాతం తగ్గింపుతో రూ.79,999కే లభిస్తోంది. అంతేకాకుండా ఈ ఫోల్డబుల్ మొబైల్‌పై అమెజాన్‌ బ్యాంక్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్స్‌ను వినియోగించి కొనుగోలు చేస్తే భారీ తగ్గింపుతో లభించనుంది. అదనపు తగ్గింపుతో ఈ మొబైల్‌ను కొనుగోలు చేయాలనుకునేవారు ICICI బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ను వినియోగించి బిల్ చెల్లించాల్సి ఉంటుంది. ఇలా బిల్ చెల్లిస్తే దాదాపు రూ.7,000 అదనపు తగ్గింపును పొందవచ్చు. దీంతో ఈ స్మార్ట్ ఫోన్‌ రూ.72,999కే పొందవచ్చు. 

ఈ మోటో Razr 40 Ultra Glacier Blue ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్‌పై అమెజాన్‌ ఎక్చేంజ్‌ ఆఫర్స్‌ను కూడా అందిస్తోంది. ఈ ఆఫర్‌ను వినియోగించాలనుకునేవారు పాత స్మార్ట్ ఫోన్‌ను ఎక్చేంజ్‌ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎక్చేంజ్‌ చేస్తే దాదాపు రూ.57,250 వరకు తగ్గింపు పొందవచ్చు. అయితే ఈ స్మార్ట్ ఫోన్‌పై ఎక్చేంజ్‌ ఆఫర్‌ అనేది మీరు ఎక్చేంజ్‌ చేసే మొబైల్‌ బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుంది. దీంతో అన్ని ఆఫర్స్‌ పోను ఈ Razr 40 Ultra Glacier Blue ఫోల్డబుల్ మొబైల్‌ రూ.22,749కే లభిస్తుంది. 

 Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

Moto Razr 40 Ultra ఫీచర్స్‌:
3.6 అంగుళాల QuickView poOLED కవర్ డిస్‌ప్లే
144 Hz రిఫ్రెష్ రేట్‌
360 Hz టచ్ శాంప్లింగ్ రేట్
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రోటక్షన్‌
6.9 అంగుళాల ఫ్లెక్స్‌వ్యూ పోలెడ్ మెయిన్ డిస్‌ప్లే
165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్
360 హెర్ట్జ్ టచ్ శాంప్లింగ్ రేట్
Qualcomm Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్‌
ఆండ్రాయిడ్ OS అప్‌గ్రేడ్‌లు 
32-మెగాపిక్సెల్ బ్యాక్‌ కెమెరా
12-మెగాపిక్సెల్  కెమెరా
13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా
33W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌
5W వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్‌
3800mAh బ్యాటరీ ప్యాక్‌
USB టైప్-సి ఛార్జింగ్ పోర్ట్
డాల్బీ అట్మోస్‌తో కూడిన డ్యూయల్ స్టీరియో స్పీకర్లు
సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్

Also Read:`Kishan Reddy: తెలంగాణలో కాషాయ జెండా ఎగురవేస్తాం.. కిషన్ రెడ్డి ధీమా  

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook

Trending News