Motorola Edge 50 Ultra: 108MP ప్రధాన కెమెరాతో Edge 50 Ultra మొబైల్‌ రాబోతోంది.. ఫీచర్స్‌ వివరాలు ఇవే!

Motorola Edge 50 Ultra: త్వరలోనే ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటో నుంచి కొత్త మొబైల్ లాంచ్ కాబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ ఎంతో శక్తివంతమైన ఫీచర్స్ తో అందుబాటులోకి రానుంది. అయితే ఈ మొబైల్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకోండి.

Written by - Dharmaraju Dhurishetty | Last Updated : Mar 29, 2024, 08:20 PM IST
Motorola Edge 50 Ultra: 108MP ప్రధాన కెమెరాతో Edge 50 Ultra మొబైల్‌ రాబోతోంది.. ఫీచర్స్‌ వివరాలు ఇవే!

Motorola Edge 50 Ultra: ప్రీమియం కెమెరా కలిగిన స్మార్ట్ ఫోన్స్ అందించేందుకు మొబైల్‌ కంపెనీ మోటోరోలా ఎప్పుడూ ముందుంటుంది. అతి తక్కువ ధరలోని శక్తివంతమైన కెమెరాలతో కూడిన మొబైల్స్‌ను ఇప్పటివరకు ఈ కంపెనీ ఎన్నో విడుదల చేసింది. ఇందులో చాలావరకు స్మార్ట్ ఫోన్స్ మార్కెట్లో మంచి గుర్తింపు తెచ్చుకున్నావే. అయితే ఇదే గుర్తింపును కంటిన్యూ చేసేందుకు మోటరోలా కంపెనీ మార్కెట్లోకి మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురాబోతోంది. 2024 సంవత్సరంలో కంపెనీ తమ అత్యంత శక్తివంతమైన లాంచ్ చేసేందుకు సిద్ధంగా ఉంది. దీనిని Motorola Edge 50 Ultra మోడల్ లో లాంచ్ చేయబోతున్నట్లు తెలిపింది అంతేకాకుండా ఈ మొబైల్ కు సంబంధించిన లాంచింగ్ అధికారిక తేదీని కూడా ప్రకటించింది. అయితే ఈ స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన ఫీచర్స్ ఏంటో వాటి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రముఖ స్మార్ట్ ఫోన్ కంపెనీ మోటరోలా లాంచ్ చేయబోయే Edge 50 Ultra మొబైల్ రాయల్ డిజైన్లు అందుబాటులోకి రాబోతోంది దీనిని కంపెనీ ఏప్రిల్ మూడవ తేదీన భారతదేశ వ్యాప్తంగా లాంచ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ స్మార్ట్ ఫోన్ ప్రత్యేకమైన కలర్ ఆప్షన్స్‌లో అందుబాటులోకి రాబోతున్నట్లు సమాచారం. లాంచింగ్ కి ముందే సోషల్ మీడియా ప్లాట్ ఫామ్‌లో ఈ మొబైల్ మంచి గుర్తింపు పొందింది. ఇటీవలే ఆండ్రాయిడ్ హెడ్‌లైన్స్ నివేదిక ప్రకారం.. ఈ స్మార్ట్ ఫోన్ మొత్తం మూడు (బీజ్, బ్లాక్, పీచ్ ఫడ్జ్) కలర్ ఆప్షన్స్ లో అందుబాటులోకి రాబోతున్నట్లు పేర్కొంది.  అంతేకాకుండా కంపెనీ Moto X50 అల్ట్రా స్మార్ట్ ఫోన్ కు సంబంధించిన టీజర్ను చైనాలో అధికారికంగా డిస్ప్లే చేస్తోంది. 

అయితే ఇటీవలే ఈ Motorola Edge 50 Ultra స్మార్ట్ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ప్రత్యేకమైన ఫీచర్స్ సోషల్ మీడియాలో లీక్ అయ్యాయి. వివరాల ప్రకారం ఎడ్జ్ 50 ప్రో మోడల్‌ను మోటరోలా కంపెనీ ఏప్రిల్ మూడో తేదీన లాంచింగ్ కి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మొబైల్ కు సంబంధించిన ఫీచర్స్ వివరాలు కి వెళ్తే.. ఇది లెదర్ బ్యాక్ ప్యానెల్ తో దీర్ఘచతురస్రాకార బ్యాక్ కెమెరా మాడ్యూల్ ను కలిగి ఉంటుంది. దీంతోపాటు ఇందులో ప్రధాన కెమెరా శక్తివంతమైన సెన్సార్ తో రాబోతోంది. అంతేకాకుండా ఈ కెమెరా  5x ఆప్టికల్ జూమ్‌, 75mm పెరిస్కోప్ లెన్స్‌ సెట్ అప్ తో కస్టమర్స్ కి లభించబోతోంది. దీంతోపాటు ఇది లేజర్ ఆటో ఫోకస్ సపోర్ట్‌తో కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.

మోటరోలా ఎడ్జ్ 50 ప్రో టాప్ ఫీచర్స్:
డిస్ప్లే:

6.7" pOLED డిస్ప్లే
144Hz రిఫ్రెష్ రేట్
HDR10+ సపోర్ట్
10-bit కలర్ డెప్త్

ప్రాసెసర్:
Qualcomm Snapdragon 8 Gen 2
4nm ప్రాసెస్ టెక్నాలజీ
8GB RAM
256GB స్టోరేజ్

కెమెరా:
108MP ప్రధాన కెమెరా
50MP అల్ట్రా-వైడ్ కెమెరా
12MP టెలిఫోటో కెమెరా
32MP సెల్ఫీ కెమెరా

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

బ్యాటరీ:
5000mAh బ్యాటరీ
33W టర్బోపవర్ ఫాస్ట్ చార్జింగ్

ఇతర ఫీచర్స్:
Android 13
5G కనెక్టివిటీ
Wi-Fi 6E
బ్లూటూత్ 5.3
స్టీరియో స్పీకర్లు
ఇన్-డిస్ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్

Also Read Vivo T3 5G: రూ.20 వేల లోపే శక్తివంతమైన ఫీచర్స్‌తో మార్కెట్‌లోకి Vivo T3 5G మొబైల్‌.. పూర్తి వివరాలు ఇవే..

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

TwitterFacebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

Trending News