Motorola Edge 50 Pro Price: ప్రస్తుతం స్మార్ట్‌ఫోన్ కంపెనీలన్నీ ప్రీమియం ఫీచర్స్‌తో కూడిన మొబైల్‌ను మార్కెట్‌లో లాంచ్ చేస్తున్నాయి. ముఖ్యంగా కొన్ని కంపెనీలు అతి తక్కువ ధరలోనే AI ఫీచర్స్ కలిగిన స్మార్ట్‌ఫోన్స్‌ను కూడా లాంచ్ చేస్తున్నాయి. అయితే ప్రముఖ మొబైల్ కంపెనీ Motorola కూడా కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలోనే శక్తివంతమైన ఫీచర్స్‌తో కూడిన మొబైల్‌ను లాంచ్ చేయబోతున్నట్లు తెలిపింది. ఇది Motorola Edge 50 Pro మొబైల్ పేరుతో మార్కెట్‌లోకి రాబోతోంది. అంతేకాకుండా దీనిని AI ఫీచర్స్‌తో లాంచ్ చేస్తున్నట్లు పలువురు టిప్‌స్టర్స్ తెలిపారు. ఇది గూగుల్ పిక్సెల్ 8 సిరీస్ మొబైల్‌ను పోలీ ఉంటుందని మార్కెట్‌లో టాక్.. అయితే ఈ మొబైల్‌కి సంబంధించిన మరిన్ని వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
ఈ మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో (Motorola Edge 50 Pro) స్మార్ట్‌ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌తో డిస్‌ప్లేతో అందుబాటులోకి రాబోతోంది. అంతేకాకుండా ఇందులో శక్తివంతమైన బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌ను కూడా కలిగి ఉంటుంది. ఇది 6.7 అంగుళాల pOLED డిస్‌ప్లేతో అందుబాటులోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా 1.5కే రిజల్యూషన్‌తో అందుబాటులోకి రానుంది. దీని స్క్రీన్ 2000 nits గరిష్ట వంతమైన 2000 nits బ్రైట్‌నెస్ సపోర్ట్‌తో లభించనుంది. ఈ Edge 50 Pro మొబైల్ ట్రిపుల్ కెమెరా సెటప్‌తో పాటు పాటు LED ఫ్లాష్ సెటప్‌తో అందుబాటులోకి రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లోని ప్రధాన కెమెరా 50 మెగాపిక్సెల్ AI ప్రో-గ్రేడ్‌తో రాబోతోంది.
అలాగే ఈ మొబైల్‌కి సంబంధించిన ఇతర ఫీచర్స్ వివరాల్లోకి వెళితే..Motorola Edge 50 Pro స్మార్ట్‌ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 చిప్‌సెట్‌పై రన్ కాబోతోంది. గేమింగ్, స్కోలింగ్ చేసేవారికి ఈ స్క్రీన్ మంచి అనుభూతిని ఇస్తుంది. ఇక ఈ మొబైల్ బ్యాటరీ వివరాల్లోకి వెళితే..ఇది శక్తివంతమైన 4500mAh బ్యాటరీతో లభించనుంది. దీంతో పాటు 125 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో లభించబోతున్నట్లు టిప్‌స్టర్స్ తెలుపుతున్నారు. ఈ మొబైల్ భారత్‌లో లాంచ్ అయితే రూ.40,000లకు లభించే అవకాశాలు ఉన్నాయి. దీంతో పాటు ఇది ఆండ్రాయిడ్ 14 OSపై రన్ కాబోతోంది. అయితే ఈ స్మార్ట్‌ఫోన్‌కి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంటుంది.
మోటోరోలా ఎడ్జ్ 50 ప్రో టాప్ ఫీచర్స్:
1. డిస్ప్లే:
6.7-అంగుళాల 1.5K 144Hz పోల్డ్ డిస్ప్లే
HDR10+ సపోర్ట్
2,000 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్
పాంటోన్ ధృవీకరించబడింది
2. ప్రాసెసర్:
క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 3 SoC
12GB RAM
256GB/512GB స్టోరేజ్
3. కెమెరా:
50MP ప్రధాన కెమెరా
13MP అల్ట్రా-వైడ్ కెమెరా
10MP టెలిఫోటో కెమెరా (50x హైబ్రిడ్ జూమ్)
AI అడాప్టివ్ స్టెబిలైజేషన్
ఆటోఫోకస్ ట్రాకింగ్
AI ఫోటో ఎన్‌హాన్స్‌మెంట్ ఇంజన్
టిల్ట్ మోడ్
4. బ్యాటరీ:
5000mAh బ్యాటరీ
125W టర్బో పవర్ ఛార్జింగ్
50W వైర్‌లెస్ ఛార్జింగ్
5. ఇతర ఫీచర్స్:
5G కనెక్టివిటీ
ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ సెన్సార్
స్టీరియో స్పీకర్లు
వాటర్ రిజిస్టెన్స్ (IP68)
Android 14
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
Twitter, Facebookసోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి